ఘోరం ! హర్యానాలోని ఆసుపత్రిలో 1710 కోవిడ్ వ్యాక్సిన్ల చోరీ, జింద్ జిల్లాలో నో వ్యాక్సిన్
దారుణం ! హర్యానాలోని జింద్ జిల్లాలో గల ఆసుపత్రి నుంచి 1710 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ను దొంగలు దొంగిలించుకుపోయారు. ఈ జిల్లాలోని పీపీ సెంటర్ జనరల్ హాస్పిటల్ స్టోర్ రూమ్ నుంచి వీటిని గత రాత్రి చోరీ చేశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
దారుణం ! హర్యానాలోని జింద్ జిల్లాలో గల ఆసుపత్రి నుంచి 1710 డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ను దొంగలు దొంగిలించుకుపోయారు. ఈ జిల్లాలోని పీపీ సెంటర్ జనరల్ హాస్పిటల్ స్టోర్ రూమ్ నుంచి వీటిని గత రాత్రి చోరీ చేశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీటిలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉన్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రూమ్ లోని ఇతర మందులు, నగదును మాత్రం దొంగలు ముట్టుకోలేదు. వ్యాక్సిన్లనే వారు తమ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ చోరీతో ఈ జిల్లాలో అసలు వ్యాక్సిన్ అంటూ లేకుండా పోయింది. ఇక మందులను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలో హర్యానా రెండో స్థానంలో ఉండగా, పంజాబ్ మూడో స్థానంలో ఉంది. తమిళనాడు మరీ ఘోరంగా మొదటి స్థానంలో ఉన్నట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి. హర్యానాలో నిన్న తాజాగా 9,623 కరోనా కేసులు నమోదయ్యాయి. 45 మంది రోగులు మృతి చెందారు. డబుల్ మ్యుటెంట్ తో బాటు యూకే స్టెయిన్ కూడా ఈ రాష్ట్రాన్ని తాకింది. కర్నాల్, గురు గ్రామ్ జిల్లాల్లో యూకే స్టెయిన్ కేసులు 19, డబుల్ మ్యుటెంట్ కేసులు 77 నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 381247 కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిలో 55 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఫరీదాబాద్, సోనేపట్, హిస్సార్, పంచ్ కుల, జింద్ జిల్లాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి.
కాగా-సోనేపట్ నుంచి ఫరీదాబాద్ కి ఆక్సిజన్ తో వెళ్తున్న ట్యాంకర్ ను ఢిల్లీ ప్రభుత్వ అధికారులు లూటీ చేశారని హర్యానా మంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. ఇక పోలీస్ ఎస్కార్టుతో ఈ ట్యాంకర్లను పంపాల్సి ఉంటుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. ఓ వైపు ఫరీదాబాద్ నుంచి ఆక్సిజన్ తమ ఢిల్లీ నగరానికి రాకుండా హర్యానా అధికారి ఒకరు అడ్డుకున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించగా.. హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రత్యారోపణ చేయడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి: అయ్యోపాపం.. నీళ్లు కోసం వచ్చి కుక్క.. ఎరుక్కపోయి… ఇరుక్కుపోయింది.!
Niharika Konidela : గులాబీ దుస్తుల్లో గుభాళించిన సోయగం.. నిహారిక ఫోటోలకు ఫిదా అవుతున్న నెటిజన్లు