Niharika Konidela: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఆమె సినిమారంగంలోకి అడుగు పెట్టారు. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసిన నిహారిక ఆతర్వాత నాగశౌర్య నటించిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారారు. ఆతర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోయారు. మెగాస్టార్ నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాలో చిన్నపాత్రలో మెరిశారు నిహారిక.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. నిహారిక వివాహం గుంటూరు రేంజ్ ఐటీ జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు, వ్యాపారవేత్త వెంకట చైతన్యతో ఘనంగా జరిగింది. అయితే సినిమాల కంటే సోషల్ మీడియాతో అభిమానులకు ఎక్కువ చేరువగా ఉంటుంది నిహారిక. తనవ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది నిహారిక. తన భర్తతో గడిపిన మధురమైన క్షణాలను ఫొటోల రూపంలో పంచుకుంటుంది నిహారిక. పెళ్లి తర్వాత కూడా నిహారిక తన గ్లామర్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో గులాబీల గుభాళించింది నిహారిక. ఈ ఫోటోలకు గులాబీ దుస్తులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలపై మీరు ఒక లుక్కేయండి.