యంగ్ హీరో రామ్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయిన్

'దేవదాసు' సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా తర్వాత రామ్ వరుస ఆఫర్లను అందుకుంటూ..

  • Rajeev Rayala
  • Publish Date - 8:14 am, Thu, 22 April 21
యంగ్ హీరో రామ్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయిన్

genelia d’souza: ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని. ఈ సినిమా తర్వాత రామ్ వరుస ఆఫర్లను అందుకుంటూ.. ఎనర్జిటిక్ స్టార్‏గా మారాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రామ్.. కొంతకాలం వరుస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో చాలా కాలం వరకు రామ్ సినిమాలు చేయలేదు. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాతో రామ్ తనలోని మాస్ యాంగిల్‏ను కూడా ప్రేక్షకులకు చూపించేశాడు. ఇక ఆ తర్వాత ఇటీవల రెడ్ సినిమాతో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ . ఈ సినిమాలో కృతి శ్శట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే త్వరలో రామ్ జానీలియా కలిసి నటించబోతున్నారని ఓ వార్త ఫిలిం నగర్లో  చక్కర్లు ,కొడుతుంది. జానీలియా తెలుగులో చాలా సినిమాల్లో నటించి ఆకట్టుకుంటుంది. రామ్ తో శ్రీనువైట్ల దర్శకత్వంలో రెడీ అనే సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ను వివాహం చేసుకుంది. ఆతర్వాత జానీలియా సినిమాలకు దూరం అయ్యింది. చాలాకాలం తరువాత జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వనుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రామ్ నటిస్తున్న సినిమా కోసం జెనీలియాన్ని సంప్రదించారని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. జెనీలియాను ఏ సినిమా కోసం సంప్రదించారనేదే తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Shruti Haasan: ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ ఆ రోల్ లో కనిపించనుందట..!

Nabha Natesh : బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ పిల్ల.. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్..

Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు