AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: ప్రభాస్ సలార్ సినిమాలో శృతిహాసన్ ఆ రోల్ లో కనిపించనుందట..!

మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకుంది అందాల భామ శృతిహాసన్ . 'క్రాక్' సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Shruti Haasan: ప్రభాస్ సలార్  సినిమాలో శృతిహాసన్ ఆ రోల్ లో కనిపించనుందట..!
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2021 | 6:33 AM

Share

Shruti Haasan

మాస్ రాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకుంది అందాల భామ శృతిహాసన్ . ‘క్రాక్’ సినిమా బాక్సాఫీసు వద్ధ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ హిట్‏తో శృతిహాసన్ తిరిగి ఫాంలోకి వచ్చింది. దీంతో ఈ అమ్మడుకి భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముందుగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ సలార్‏లో శృతిహాసన్ నటించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం గా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం సలార్ సెట్ హైదరాబాద్ శివారులో రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలతోపాటు రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు

Nabha Natesh : బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ పిల్ల.. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా