Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 30 లక్షలకు పైగా ఉన్నాయి.

Mahesh Babu: భారీగా నమోదువ్వుతున్న కేసులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన మహేష్ బాబు
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2021 | 6:23 AM

Mahesh Babu: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 30 లక్షలకు పైగా ఉన్నాయి. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేట్ తగ్గి.. యాక్టీవ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆస్పత్రులు సరిపోవడం లేదు. దాంతో కరోనా బాధితులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సినిమా తారలు, సెలబ్రెటీలు ప్రజలను కోరుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “అసాధారణమైన సమయాల్లో అసాధారణ చర్యలు అవసరం! మాస్క్ ని ధరించండి.. పరిసరాలను శుభ్రపరచండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. తప్పనిసరిగా టీకాలువేయించుకొండి . మనం ఇంతకు ముందే ఇది ఎదుర్కొన్నాం. మళ్ళీ యుద్ధం చేద్దాం. మాస్క్ ని ధరించండి – సురక్షితంగా ఉండండి – బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి“ అంటూ మహేష్ తెలిపారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో స్రకరు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఉండనుంది. అలాగే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్.

మరిన్ని ఇక్కడ చదవండి :

అనూహ్య నిర్ణయం తీసుకున్న చార్మి.. వాటిని చూసేంత ధైర్యం లేదు.. వదిలేస్తున్నా అంటూ ఎమోషనల్..

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోయిన్.. తండ్రితో ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన ముద్దుగుమ్మ..