అనూహ్య నిర్ణయం తీసుకున్న చార్మి.. వాటిని చూసేంత ధైర్యం లేదు.. వదిలేస్తున్నా అంటూ ఎమోషనల్..

అనూహ్య నిర్ణయం తీసుకున్న చార్మి.. వాటిని చూసేంత ధైర్యం లేదు.. వదిలేస్తున్నా అంటూ ఎమోషనల్..
Charmi

ఒకప్పుడు హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగి ఆకస్మాత్తుగా సినిమాలకు స్వస్తి చెప్పింది చార్మి. హీరోయిన్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టిన ఈ చిన్నది..

Rajitha Chanti

|

Apr 21, 2021 | 7:44 PM

ఒకప్పుడు హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగి ఆకస్మాత్తుగా సినిమాలకు స్వస్తి చెప్పింది చార్మి. హీరోయిన్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టిన ఈ చిన్నది.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ప్రొడక్షన్ రంగంలో దిగింది. వీరిద్దరు కలిసి అనేక పూరీ కనెక్ట్స్ అనే బ్యానర్ పై అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. తాజాగా చార్మి అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ లేఖను పంచుకుంది. ఇందులో ఆమె కరోనా విలయ తాండవాన్ని చూడలేకపోతున్నాననంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మరింత భయంకరంగా మారేట్లు కనిపిస్తోందని ఆందోళన చెందింది. దురదృష్టవశాత్తూ వీటన్నింటినీ చూసి తట్టుకునేంత శక్తి తనకు లేదని, అందుకే కొద్దిరోజులపాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని తెలిపింది. ‘నిజానికి అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చాను. కానీ మన దేశం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. అందరూ ఇంట్లోనే ఉండి, మీరు ప్రేమించేవారిని జాగ్రత్తగా చూసుకోండి.. అని అభిమానులకు సూచించింది. అందుకే ఇప్పుడు నేను సోషల్‌ మీడియాను వదిలేస్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి’ అని చేతులెత్తి వేడుకుంది.

ప్రస్తుతం చార్మి.. రౌడీ హీరో విజయ్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా నిర్మాణ బాధ్యతలను చూసుకుంటుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే.. 

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu