AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యోపాపం.. నీళ్లు కోసం వచ్చి కుక్క.. ఎరుక్కపోయి… ఇరుక్కుపోయింది.!

పాపం కుక్క… దాహం వేసింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని..

అయ్యోపాపం.. నీళ్లు కోసం వచ్చి కుక్క.. ఎరుక్కపోయి... ఇరుక్కుపోయింది.!
Dog
Ravi Kiran
|

Updated on: Apr 22, 2021 | 2:35 PM

Share

పాపం కుక్క… దాహం వేసింది. ఓ ఇంటి పెరట్లో బిందెలో నీళ్లు చూసి దాహం తీర్చుకుందామని ఎరుక్కపోయి ఇరుక్కుపోయింది. ఇక చూస్కో అక్కడ నుంచి అది నరకం చూసింది. తన ఎదురుగా ఏముందో కూడా తెలియక, ఎటూ వెళ్ళలేక నానా అగచాట్లు పడింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామంలో ఓ వీధికుక్కకు ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. మండుతున్న ఎండలతో దహనం తీర్చుకోవడానికి పాపం అది… అక్కడా ఇక్కడా తిరిగి తిరిగి అలసిపోయి నీళ్ళు తాగుదామని బిందెలో మూతిపెట్టింది. నీళ్లయితే తాగేసింది. ఇక తల తీద్దామంటే ఇరుక్కుపోయింది. దానిని తీసుకోవడానికి నానా తంటాలు పడింది. అటు పరుగెత్తింది. ఇటు పరిగెత్తింది. వీలు కాలేదు.

పాపం శునకం పడుతున్న ఇబ్బందులు చూసిన స్థానికులు ఓ తాడు సాయంతో దానికి విముక్తి కల్పించారు. మెడకు తాడు వేసి గట్టిలాగటంతో..ఎట్టకేలకు కుక్కతల బిందెలోంచి బయటకు వచ్చింది.

Read also:

Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!

Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!