Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!
అడవిలో నియమాలు భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు నీటిలో రారాజులుగా ఉంటే..
అడవిలో నియమాలు భిన్నంగా ఉంటాయి. కొన్ని జంతువులు నీటిలో రారాజులుగా ఉంటే.. మరికొన్ని నేలపైన రాజులుగా మెలుగుతాయి. ఏ జంతువుల గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.? అదేనండీ సముద్రపు ‘అలెగ్జాండర్’గా పిలవబడే మొసలి. అడవికి రాజు సింహం. ఈ రెండూ కూడా ఒకదానికి మరొకటి ఎదురైతే.. యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి? ఖచ్చితంగా ఒళ్లుగగుర్పొడుస్తుంది కదూ. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేరే జంతువుకు ఎరగా చిక్కకుండా ఉండాలంటే ప్రతీ జంతువు తమను తాము రక్షించుకుంటాయి. ఈ తరుణంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా జంతువుల మధ్య తరచూ పోరాటాలు జరుగుతుంటాయి. ఇక దానికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, రెండు పెద్ద జంతువులు పోరాటానికి దిగితే.! ఆ దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచే విధంగా ఉంటాయి. లేట్ ఎందుకు మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి..
— Life and nature (@afaf66551) April 20, 2021
ఈ వీడియో చూసినట్లయితే.. నది ఒడ్డున చనిపోయిన ఓ జంతువు కళేబరాన్ని సింహాల గుంపు తింటుండగా.. ఒక్కసారిగా మొసళ్లు వాటిని చుట్టుముడతాయి. వాటిని చూసి సింహాలు బెదరలేదు. ‘నువ్వా.. నేనా” అంటూ యుద్దానికి దిగాయి. ఓ సింహాన్ని పట్టుకునేందుకు మొసలి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏది ఏమైనా ఈ రెండు భీకర జంతువుల మధ్య హోరాహోరీ పోరు మాత్రం జరిగింది. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. నెటిజన్లు వరుసగా రీ-ట్వీట్లతో హోరెత్తించారు.
Read also:
Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!
అయ్యోపాపం.. నీళ్లు కోసం వచ్చి కుక్క.. ఎరుక్కపోయి… ఇరుక్కుపోయింది.!