New Rules: ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు ఇవే.. ఏమేం మారతాయంటే..?
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపే కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఫిబ్రవరి ఒకటి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం.

Rules Changed From 1 February 2022: కొత్త ఏడాది అనుకున్నాం.. వచ్చేశాం. 2022లో జనవరి నెల ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక ఫిబ్రవరి నెలలోకి అడుగుపెడుతున్నాం. అయితే సామాన్యుడుకి మాత్రం ప్రతి నెలా మొదటి తేదీ ఇంపార్టెంట్. ఎందుకంటే అతడి జీవన విధానంపై ప్రభావం చూపే వివిధ అంశాల్లో 1వ తేదీన మార్పులు సంభవిస్తాయి. చాలా మంది వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో, వ్యాపార సరళిలో 1వ తేదీన కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్ నిబంధనలు(Banking Rules), ఎల్పీజీ ధరలు(LPG Rates), మార్పులు జరగనున్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
ఎల్పీజీ సిలిండర్ ధర…
ప్రతి నెల తొలి రోజున ఎల్పీజీ సిలిండర్ ధరలపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తాయి చమురు సంస్థలు. ప్రజంట్ సినారియో చూస్తుంటే వంట గ్యాస్ ధరలను పెంచే చాన్సస్ ఉన్నాయి. అందుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరల్లో పెరుగుదల కనిపించటం ఒక రీజన్ అని చెప్పవచ్చు. మరోవైపు.. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న క్రమంలో మోదీ సర్కార్ గ్యాస్ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజంట్ దేశ రాజధాని ఢిల్లీలో గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.899.50గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో రూ.899.50, కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1998.50, కోల్‌కతాలో రూ.2,076, ముంబైలో రూ.1,948.50, చెన్నైలో రూ.2,131గా ఉంది.
ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీల్లో మార్పు..
ఎస్బీఐ.. కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది. డిజిటల్ ఇమీడియట్ పేమెంట్స్ సర్వీస్(ఐఎంపీఎస్) లావాదేవీల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ 2022, ఫిబ్రవరి 1న అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఎస్బీఐ యూజర్స్.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా రూ.5 లక్షల వరకు ఫ్రీగా ఐఎంపీఎస్ సేవలను పొందవచ్చు. గతంలో ఉచిత చెల్లింపులు రూ.2 లక్షల వరకే అందించగా.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రూ.5 లక్షల వరకు పెంచినట్లు వెల్లడించింది బ్యాంక్.
ఇక ఏదైనా ఎస్బీఐ బ్యాంక్ శాఖ ద్వారా ఐఎంపీఎస్ పేమెంట్స్ చేస్తే.. ప్రస్తుతం ఉన్న స్లాబ్స్ ప్రకారమే సర్వీస్ ట్యాక్స్ ఉంటుందని, ఎలాంటి మార్పులు చేయటం లేదని వివరించింది. అయితే.. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పేమెంట్స్ స్లాబ్‌ను కొత్తగా తీసుకొచ్చింది ఎస్బీఐ. దీనికి రూ.20+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూల్ ఫిబ్రవరి 1న అమలులోకి రానుంది. ప్రజంట్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా రూ.వెయ్యిలోపు ఐఎంపీఎస్ పేమెంట్స్ కు ఎలాంటి ఛార్జీలు లేవు. రూ.1000 నుంచి రూ.10వేల లోపు చెల్లింపులకు రూ.2+జీఎస్టీ, రూ.10వేల నుంచి రూ.లక్షలోపు చెల్లింపులకు రూ.4+ జీఎస్టీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రూ.12+జీఎస్టీ, రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ. 20+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Viral Photo: ఈ ఫొటోలో ఓ పిల్లి దాగి ఉంది.. గుర్తించగలరా.? నూటికి 90 మంది ఫెయిలయ్యారు