AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం..

Rajasthan Fire Accident: రాజస్థాన్ రాజధాని జైపూర్‌ (Jaipur) కు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జామ్వా రాంగఢ్‌లోని

Rajasthan: ఆయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురు దుర్మరణం..
Shaik Madar Saheb
|

Updated on: Jan 30, 2022 | 6:02 PM

Share

Rajasthan Fire Accident: రాజస్థాన్ రాజధాని జైపూర్‌ (Jaipur) కు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జామ్వా రాంగఢ్‌లోని టర్పెంట్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ (oil factory) లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్పీ శివకుమార్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ ఘటన (Fire Accident)లో నలుగురు మృతి చెందారని తెలిపారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైపూర్‌ పోలీసులు తెలిపారు. కాగా.. ఫ్యాక్టరీలో పేయింట్‌ పనుల కోసం టర్పెంట్‌ ఆయిల్‌ను ప్యాక్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులిచ్చాడు.. చివరకు కోపంతో మాజీ భార్యపై..

Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

Follow Us
రోజూ రూ.115 పెట్టుబడి పెడితే ఐదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా
రోజూ రూ.115 పెట్టుబడి పెడితే ఐదేళ్లలో ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా
ఇంటి డోర్స్‌పై జిడ్డు మరకలా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో..
ఇంటి డోర్స్‌పై జిడ్డు మరకలా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో..
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..?
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు 'వారణాసి' సినిమా స్టోరీని లీక్ చేసిన రాజమౌళి
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఐస్ బాత్‌లు, నో ఫోన్ రూల్స్.. టీమిండియా కుర్రాళ్ల ‘సండే సీక్రెట్’
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
ఉదయం ఈ 3 శబ్దాలు విన్నారా? వాస్తు ప్రకారం మీ రోజు మారిపోతుంది..
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
త్రిషతో కలిసి ఆ స్టార్ హీరో భార్య సందడి..ఎవరో గుర్తుపట్టారా.. ?
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
అప్పట్లో ఫుల్ డిమాండ్.. పల్లెటూరి కార్తీక మాస పచ్చడి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
కుక్క కరిచిన వెంటనే ఈ పనులు చేయండి..
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే
ఉద్యోగం చేసేవాళ్లే కాదు.. ఈ 9 మంది కూడా పన్ను చెల్లించాల్సిందే