Crime News: ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులిచ్చాడు.. చివరకు కోపంతో మాజీ భార్యపై..

Karnataka Crime News: వారిద్దరూ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. ఎవరికి వారే విడివిడిగా

Crime News: ప్రేమించి పెళ్లి చేసుకొని.. విడాకులిచ్చాడు.. చివరకు కోపంతో మాజీ భార్యపై..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 30, 2022 | 3:38 PM

Karnataka Crime News: వారిద్దరూ కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. ఎవరికి వారే విడివిడిగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ భార్యపై కక్ష్య పెంచుకున్న భర్త.. దారుణంగా చంపాడు. విడిపోయి ఉంటున్న మాజీ భార్యను గొంతు కోసి చంపాడు. ఈ దుర్ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మండ్య (Mandya) తాలూకాలోని రాగిముద్దనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు సురేష్.. మాజీ భార్య షాలిని (32)ని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సురేష్, షాలిని 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో సురేష్, షాలిని మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతోపాటు కోడలు-అత్త మధ్య కూడా గొడవలు పెరగడంతో.. విసిగిపోయిన షాలిని ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని తన ఇంట్లోనే పిల్లలతో ఉంటూ కూలీ పనులకు వెళుతూ జీవిస్తోంది.

సురేష్ వృత్తిరీత్యా డ్రైవర్‌.. ఈ క్రమంలో షాలినిపై కక్ష్య పెంచుకున్న సురేష్.. శుక్రవారం సాయంత్రం కూలి పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న షాలినిని అడ్డగించాడు. ఆ తర్వాత దగ్గర్లోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి చాకుతో గొంతుకోసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండ్య పోలీసులు తెలిపారు.

Also Read:

Love Story: కొడుకు చేసిన పనికి దారుణ హత్యకు గురైన తల్లి.. ఇంతకీ అతనేం చేశాడంటే..

Road Accident: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం..