Supreme Court: ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమే.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు..
ఓబీసీ రిజర్వేషన్లు (OBC reservations) రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. ఓబిసీ(OBC), ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్ల చట్టబద్ధతను సవాలు..
ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. ఓబిసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చట్టబద్ధతను సవాలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఈ తీర్పునిచ్చింది. రాజ్యాంగ బద్ధత కు కారణాలు వెల్లడించిన జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ బోపన్న ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4) (5) సమానత్వపు హక్కుకు వాస్తవిక కోణాలు ఉన్నాయని పేర్కొంది. పోటీ పరీక్షలు అనేవి సామాజిక ఆర్థిక బలమైన వర్గాలు పొందుతున్న ప్రయోజనాలను చూపదని వెల్లడించింది. దీనికి మెరిట్‌కు రిజర్వేషన్లు అడ్డంకి కాబోదన్నారు.
కాగా ఇటీవల నీట్ పరీక్షల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) రిజర్వేషన్‌లకు సుప్రీంకోర్టు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను రూ.8 లక్షల క్రీమీలేయర్ ఆధారంగా అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం జనవరి 7వ తేదీన తీర్పును ఇచ్చారు. అయితే ఈ అంశంపై గురువారం సుప్రీంకోర్టు సుధీర్ఘంగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను అమలు చేయరాదని, ఈ కారణంగా నీట్ పీజీ కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అవుతోందిని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..
Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్ చాలా స్పెషాల్..