AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 Study: వారిలో ఆరు నెలలకే తగ్గుతున్న ఇమ్యూనిటీ.. కీలక వివరాలు వెల్లడించిన ఏఐజీ అధ్యయనం..

COVID-19 study: కరోనా బారిన పడుకుండా సురక్షితంగా ఉండాలంటే వ్యాక్సీన్ వేసుకోవడమే శ్రీరామ రక్ష అని నిపుణులు

COVID-19 Study: వారిలో ఆరు నెలలకే తగ్గుతున్న ఇమ్యూనిటీ.. కీలక వివరాలు వెల్లడించిన ఏఐజీ అధ్యయనం..
Shiva Prajapati
|

Updated on: Jan 20, 2022 | 1:01 PM

Share

COVID-19 study: కరోనా బారిన పడుకుండా సురక్షితంగా ఉండాలంటే వ్యాక్సీన్ వేసుకోవడమే శ్రీరామ రక్ష అని నిపుణులు అందరూ ఉద్ఘాటిస్తున్నారు. అయితే, వ్యాక్సీన్ తీసుకున్న వారు సైతం కోవిడ్ బారిన పడుతుండటంతో.. వ్యాక్సీన్ ప్రభావం ఎంత? దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? శరీరంలో ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఇమ్యూనిటీపై ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్‌తో పాటు ఏఐజీ హాస్పిటల్స్ ఒక అధ్యయనం నిర్వహించాయి. దీని ప్రకారం.. 30 శాతం మంది వ్యక్తులు టీకా పొందిన 6 నెలల తర్వాత రోగనిరోధక శక్తిని కోల్పోయినట్లు తేల్చారు.

కరోనా వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా టీకాలు వేసిన 1,636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ మేరకు AIG హాస్పిటల్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మా అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సమానంగా ఉన్నాయి. దాదాపు 30 శాతం మంది వ్యక్తుల్లో ఆరు నెలల తర్వాత రక్షిత రోగనిరోధక శక్తి స్థాయి 100 AU/ml కంటే తక్కువ యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్నట్లు గుర్తించాము. వీరిలో ఎక్కువగా 40 సంవత్సరాల కంటే పైబడిన వారు, రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలతో ఉన్నారు. ఇక 6 శాతం మందిలో రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందలేదు.’’ అని AIG హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.

వయస్సుతో పాటు, రోగనిరోధక శక్తి క్షీణించడం అనులోమానుపాతంలో ఉంటుందని ఫలితాలు స్పష్టంగా సూచించాయని అధ్యయనంలో తేల్చారు. అంటే.. వృద్దుల్లో కంటే యువకులలో ఎక్కువ యాంటీబాడీ స్థాయిలు ఉన్నట్లు గుర్తించారు. హైపర్‌టెన్షన్, మధుమేహం వంటి అనారోగ్యాలతో 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు పూర్తిగా టీకాలు వేసిన ఆరు నెలల తర్వాత తక్కువ యాంటీబాడీలను కలిగి ఉన్నారని ఈ అధ్యయనం తేల్చింది.

మధుమేహం, రక్తపోటు సమస్య ఉన్న 40 ఏళ్లు పైబడిన వ్యక్తులు SARS-CoV-2 వ్యాప్తి చెందే విషయంలో ఎక్కువ ప్రమాదం కలిగి ఉండవచ్చు అని ఏఐజీ అధ్యయనం అభిప్రాయపడింది. ఈ వ్యక్తులకు ఆరు నెలల తర్వాత బూస్టర్ మోతాదుకు ప్రాధాన్యత ఇవ్వాలని, AIG తెలిపింది. ప్రస్తుతం, ముందు జాగ్రత్త డోస్ కోసం తొమ్మిది నెలల గ్యాప్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్ కారణంగా ఆరు నెలలకు మించి తగినంత యాంటీబాడీ స్థాయిలను కలిగి ఉన్న జనాభాలో 70 శాతం మందికి ప్రయోజనం చేకూరుస్తుందని ఏఐజీ నిపుణులు చెబుతున్నారు. అయితే, మన దేశ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటే, 30 శాతం మంది వ్యక్తులు ముఖ్యంగా హైపర్‌టెన్షన్, మధుమేహం మొదలైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నారు. పూర్తిగా టీకాలు వేసినా ఆరు నెలల తర్వాత వీరికి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు.

Also read:

ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో

Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..