Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. 

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. 
Petrol Diesel Prices

ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను గురువారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని

Sanjay Kasula

|

Jan 20, 2022 | 9:06 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను గురువారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో కొద్దిగా తగ్గినట్లుగా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ  వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా..

ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు. అవును, క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. ఆ కోణంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రతిరోజూ పెంచవచ్చు. కానీ, ప్రస్తుతం దేశంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతూనే మరోవైపు 78 రోజులుగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.57గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.95గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.93గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.36గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.94.62గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.91పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.34గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.35కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.44లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.44గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.57లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.59గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.35లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.50 ఉండగా.. డీజిల్ ధర రూ.91.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.51 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.04గా ఉంది.

ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu