Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

భారతీయ రైల్వేలు దేశానికి జీవనాడి. భారతీయ రైల్వేలు తక్కువ ఖర్చుతో దేశంలోని ప్రజలకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితమైన రవాణాను అందించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..
Budget
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2022 | 8:26 PM

ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్ 2022-23ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. దేశంలోని ప్రతి పౌరుడి బడ్జెట్ దేశ బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈసారి కూడా ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రతిసారీలాగే ఈసారి కూడా దేశ ప్రజల దృష్టి రైలు బడ్జెట్‌పైనే ఉంటుంది. దేశంలోని అట్టడుగు, మధ్యతరగతి వర్గాలే కాదు, పై తరగతి ప్రజలు కూడా రైలులో ప్రయాణించడమే ఇందుకు అతిపెద్ద కారణం. రైలులో ప్రయాణించే ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎలాంటి హల్వాను రెడీ చేస్తోందో తెలసుకుందాం.

10 కొత్త రైళ్లను ప్రకటించే ఛాన్స్..

భారతీయ రైల్వేలు దేశానికి జీవనాడి. భారతీయ రైల్వేలు తక్కువ ఖర్చుతో దేశంలోని ప్రజలకు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితమైన రవాణాను అందించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఆర్ధిక విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ప్రభుత్వం రైల్వేల వ్యయాన్ని 15 శాతం వరకు పెంచవచ్చు.

ప్రయాణికుల సౌకర్యార్థం 10 కొత్త రైళ్లను ప్రకటించవచ్చు. విశేషమేమిటంటే వందే భారత్‌తో ర్యాక్‌లతో పాటు ఈ 10 రైళ్లన్నీ పట్టాలు ఎక్కించనుంది. అంతే కాకుండా హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇదే అంశంపై ఈ బడ్జెట్‌లో పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉంది.

అల్యూమినియం కోచ్‌లతో కూడిన రైళ్లు..

వేగాన్ని పెంచే ప్రయత్నంలో భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అల్యూమినియంతో తయారు చేసిన తేలికపాటి కోచ్‌లతో నడపాలని యోచిస్తోంది. భారతీయ రైల్వేల తాజా అప్‌డేట్‌ల ప్రకారం.. ఈ హైటెక్ రైళ్ల కోసం ఈ తేలికపాటి కోచ్‌ల తయారీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈసారి రైళ్లలో భారీ మార్పును ప్రకటించే ఛాన్స్ ఉంది.

కోచ్‌లు తేలికైనందున రైలు తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది.. హై-స్పీడ్ రైళ్ల కార్యకలాపాలపై తక్కువ ఖర్చు కూడా తగ్గుతుంది. అల్యూమినియం కోచ్‌లతో కూడిన రైళ్లు విద్యుద్దీకరించబడిన డబుల్ లైన్లు ఉన్న మార్గాలలో మాత్రమే నడుస్తాయి. ప్రత్యేకత ఏంటంటే.. అందులో ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామ్యం కల్పించే అవకాశం ఉంది.

500 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి..

తాజా నివేదిక ప్రకారం.. ఈసారి బడ్జెట్‌లో దేశంలోని 500 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధిని ప్రకటించవచ్చు. అంతే కాదు విద్యుత్ డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశంలో హైడ్రోజన్, జీవ ఇంధనం, సౌరశక్తితో నడిచే రైళ్లను ఈ బడ్జెట్‌లో ప్రకటించవచ్చు. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని రైలు మార్గాల్లో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ అంశాన్ని కూడా బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..

Career Option: దేశ విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకంటే ఉత్తమమైన ఎంపిక.. ఇంటర్ తర్వాత ఇలా ఆలోచించండి..