Budget 2022: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. కోటి ఆశల కొత్త బడ్జెట్ చెబుతోన్న తీపి కబురు..
Budget 2022: కొత్త బడ్జెట్ వస్తుందంటే ఎన్నో ఆశలు ఉంటాయి. ఈసారి వచ్చే బడ్జెట్‌పై కూడా అలాంటి ఆశలే నెలకొన్నాయి. అందులో ప్రధానమైంది బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించడం..
బంగారాన్ని, భారతీయులను విడతీసి చూడలేం. అంతలా మన జీవితంలో బంగారం భాగమైపోయింది. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా, పెట్టుబడిగా భావించే వారు మనలో ఎంతో మంది.
1 / 5
అందుకే బంగారానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఆసక్తిని పెంచుతుంది. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్‌లో బంగారు ప్రియులకు శుభవార్త అందించనున్నారనే వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
2 / 5
బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం 7.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది అభరణల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్.
3 / 5
బంగారంపై దిగుమతి సుంకం తగ్గితే, బంగారం ధరలు భారీగా దిగి వస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అభరణాలు, రత్నాల ఎగుమతి కౌన్సిల్ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుండి 2.5 శాతానికి తగ్గించాలని సూచించింది.
4 / 5
ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఒకే ఒక్క దెబ్బకి కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గిస్తే ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ప్రతిపాదనలను కనుక కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే గోల్డ్ అక్రమ రవాణా కూడా తగ్గిపోతుంది.