Budget 2022: బడ్జెట్‌ను అత్యధికసార్లు ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా..? ఆసక్తికర విషయాలు..

Union budget 2022: కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా భారతదేశంలో బడ్జెట్ మొదలైనప్పటి నుంచి కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Jan 21, 2022 | 10:27 AM

1958-59 సంవత్సరంలో అప్పటి దేశ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో దేశంలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధానిగా ఘనత సాధించారు. ఆ సమయంలో ఆర్థిక శాఖ పీఎం నెహ్రూ వద్ద ఉండేది.

1 / 5
నెహ్రూ తర్వాత.. ఇందిరా గాంధీ కూడా ప్రధానమంత్రిగా బడ్జెట్‌ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ కంటే ముందు బడ్జెట్‌ను సమర్పించి ఆర్థిక మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక మహిళ ఇందిరా గాంధీనే..

2 / 5
దేశంలో అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా 6 సార్లు, ఉప ప్రధానిగా 4 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఒక సందర్భంలో తన పుట్టినరోజు రోజు నాడు కూడా మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను సమర్పించారు.

3 / 5
2016లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారధ్యంలో సాధారణ బడ్జెట్ విషయంలో పెద్ద మార్పు వచ్చింది. అంతకుముందు రైల్వే బడ్జెట్‌ను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. అయితే.. ఆ రైల్వే బడ్జెట్‌ను రద్దు చేసి సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. దీంతో చిరకాల సంప్రదాయానికి తెరపడింది.

4 / 5
ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిలిచారు. అయితే.. నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1, 2022న బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

5 / 5
Follow us