Sonali Phogat: సోనాలి ఫోగట్ మృతికి అసలు కారణం ఏమిటి.. దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు..
టిక్ టాక్ స్టార్ గా పేర్గాంచిన బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానకు చెందిన ఆమె గోవాలో మృతిచెందటంపై..

Sonali Phogat: టిక్ టాక్ స్టార్ గా పేర్గాంచిన బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. హర్యానకు చెందిన ఆమె గోవాలో మృతిచెందటంపై ఎన్నో ప్రశ్నలు తలెతుత్తున్నాయి. ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. సోనాలి ఫోగట్ మృతిపై సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు. వైద్యులతో పాటు గోవా డీజీపీ జస్పాల్ సింగ్ అభిప్రాయం ప్రకారం ఆమె గుండెపోటు కారణంగా మృతిచెందినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. అయినప్పటికి.. సోనాలి ఫోగట్ మృతికి అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యప్తు ముమ్మరం చేసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ మీడియాకు వెల్లడించారు.
టిక్ టాక్ లో ఖ్యాతి పొందిన హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ ఉత్తర గోవాలోని అంజునా ప్రాంతంలో గల సెయింట్ ఆంథోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. ఆమె అనుమానస్పద స్థితిలో మృతిచెందిందని మంగళవారం పోలీసులు వెల్లడించిన విషయం తెలిసందే. ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు గోవా వైద్య కళాశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు సోనాలి ఫోగట్ దర్యాప్తు విషయమై డీజీపీ జస్పాల్ సింగ్ తో తాను ఫాలో అప్ లో ఉన్నానని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. సోనాలి ఫోగట్ ది అసహజ మరణంగా అంజున పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సీఏం ఆదేశాలతో దర్యాప్తు వేగాన్ని పోలీసులు పెంచారు. మృతురాలు సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి గోవాకు చేరుకున్నారు. ఆగష్టు 22వ తేదీన గోవాకు వచ్చిన సోనాలి ఫోగట్ అంజునా ప్రాంతంలోని ఓ హోటల్ లో స్టే చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో మంగళవారం ఉదయం 9 గంటలకు హోటల్ నుంచి ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోనాలి ఫోగట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఫిర్యాదు రావడంతో ఆమెను సెయింట్ ఆంథోని ఆసుపత్రికి తకలించామని డీజీపీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని.. పోస్ట్ మార్టం నివేదికలో మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని డీజీపీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..






