South Central Railway: 16 నెలల తరువాత పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణికులకు కీలక సూచనలు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే..
South Central Railway: దాదాపు 16 నెలల తరువాత సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను..
South Central Railway: దాదాపు 16 నెలల తరువాత సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సర్వీస్, ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులు పట్టాలకెక్కాయి. తెలుగు రాష్ట్రాలే కాకుండా.. కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు కూడా సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి. కాగా, రెండు రోజుల క్రితమే దక్షిణ మధ్య రైల్వే ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి సాధారణ రైళ్లన్నీ పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 82 ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అలాగే 16 ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సర్వీస్, 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. కర్ణాటక రాయచూరు వరకు రైళ్లు నడపున్నట్లు తెలిపింది. అయితే, సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు కీలక సూచనలు జారీచేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు కచ్చితంగా మాస్కులు ధరించాలంది. భౌతిక దూరం పాటించాలని సూచించింది. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలని పేర్కొంది.
కాగా, కరోనా వైరస్ కారణంగా సాధారణ రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రయాణికుల సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో సాధారణ రైళ్ల ప్రయాణాలను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తాజా ప్రకటనతో సుమారు 16 నెలల తరువాత సాధారణ రైళ్లు పట్టాలపైకి ఎక్కాయి.
SCR Tweet:
SCR to resume Unreserved Train Services from 19th July 2021.
– These trains will be run on par with Express Trains.
– Passengers to benefit from faster speed of the trains @RailMinIndia pic.twitter.com/fAk03vmLY9
— South Central Railway (@SCRailwayIndia) July 17, 2021
Also read:
Sher Bahadur Deuba: నేపాల్ కొత్త ప్రధానిగా షేర్ బహదూర్ డ్యూబా.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. రెండు రోజులుగా పెరగని ఇంధన ధరలు.. ఇవాళ రేట్స్ ఇలా ఉన్నాయి..