Petrol Diesel Price: వాహనదారులకు ఊరట.. రెండు రోజులుగా పెరగని ఇంధన ధరలు.. ఇవాళ రేట్స్ ఇలా ఉన్నాయి..
Petrol Diesel Price Today: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యల జేబులకు భారీగా చిల్లు పెడుతున్నాయి. నిరంతర పెరుగుదల కారణంగా
Petrol Diesel Price Today: వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యల జేబులకు భారీగా చిల్లు పెడుతున్నాయి. నిరంతర పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ రూ .100 దాటింది. కాగా, పెట్రోల్, డీజిల్ రేట్లలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. శనివారం నాడు.. ధరలు పెంచగా.. ఆదివారం నాడు స్థిరంగా ఉంచారు. సోమవారం కూడా ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతున్నాయి.
దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడే.. దేశవ్యాప్తంగా అత్యంత ఖరీదైన పెట్రోల్, డీజిల్‌ను రాజస్థాన్‌లోని గంగానగర్, మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లో విక్రయిస్తున్నారు. గంగానగర్‌లో పెట్రోల్ ధర రూ.113.21, డీజిల్ రూ .103.15 చొప్పున లభిస్తుంది. అదే సమయంలో, అనుప్పూర్‌లో నేడు పెట్రోల్ ధర రూ .112.78, డీజిల్ ధర లీటరుకు రూ .101.15 గాఉంది.
ఈ రాష్ట్రాల రాజధానిలో పెట్రోల్ రూ .100 దాటింది.. దేశంలోని 17 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలకు పైగా పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడఖ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, తమిళనాడు, బీహార్, కేరళ, పంజాబ్, సిక్కిం, పుదుచ్చేరి, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్. భోపాల్ రాష్ట్రాల్లోని రాజధానుల్లో పెట్రోల్ రూ. 100 దాటింది.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు.. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా.. ఆదిలాబాద్ – రూ. 107.79 – రూ. 99.78, భద్రాద్రి కొత్తగూడెం – రూ. 106.86 – రూ. 98.91, హైదరాబాద్ – 105.83 – రూ. 97.96, జగిత్యాల – రూ. 106.56 – రూ. 98.63, జనగామ – రూ. 105.82 – రూ. 97.94, జయశంకర్ భూపాలపల్లి – రూ. 105.79 – రూ. 97.91, జోగులాంబ గద్వాల్ – రూ.107.79 – రూ. 99.79, కామారెడ్డి – రూ. 106.95 – రూ. 98.99, కరీంనగర్ – రూ. 105.98 – రూ. 98.09, ఖమ్మం – రూ. 106.44 – రూ. 98.50, కొమరంభీం ఆసిఫాబాద్ – రూ. 107.45 – రూ. 99.46, మహబూబాబాద్ – రూ. 105.79 – రూ. 97.91, మంచిర్యాల – రూ. 106.75 – రూ. 98.81, మెదక్ – రూ. 106.22 – రూ. 98.32, మేడ్చల్ మల్కాజిగిరి – రూ. 105.83 – రూ. 97.96, మహబూబ్‌నగర్ – రూ. 106.66 – రూ. 98.73, నాగర్‌కర్నూల్ – రూ. 106.50 – రూ. 98.58, నల్లగొండ – రూ. 106.18 – రూ. 98.29, నిర్మల్ – రూ. 107.58 – రూ. 99.58, నిజామాబాద్ – రూ. 107.35 – రూ. 99.37, పెద్దపల్లి – రూ. 106.50 – రూ. 98.57, రాజన్న సిరిసిల్ల – రూ. 106.33 – రూ. 98.42, రంగారెడ్డి – రూ. 105.83 – రూ. 97.96, సంగారెడ్డి – రూ. 106.57 – రూ. 98.64, సిద్దిపేట్ – రూ. 105.71 – రూ. 97.83, సూర్యాపేట – రూ. 105.32 – రూ. 97.46, వికారాబాద్ – రూ. 106.87 – రూ. 98.93, వనపర్తి – రూ. 107.06 – రూ. 99.10, వరంగల్ – రూ. 105.38 – రూ. 97.52, వరంగల్ రూరల్ – రూ. 105.58 – రూ. 97.71, యాదాద్రి భువనగిరి – రూ. 105.48 – రూ. 97.63.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు.. ఆంధ్రప్రదేశ్ అనంతపూరం రూ.108.19 – రూ.99.75, చిత్తూరు – రూ.108.43 – రూ.99.90, కడప – రూ.107.34 – రూ.98.95, తూర్పు గోదావరి – రూ.108.05 – రూ.99.59, గుంటూరు – రూ.108.11 – రూ.99.70, కృష్ణా – రూ.107.63 – రూ.99.25, కర్నూలు – రూ.108.09 – రూ.99.65, నెల్లూరు – రూ.107.73 – రూ.99.29, ప్రకాశం – రూ.108.25 – రూ.99.81, శ్రీకాకుళం – రూ.108.01 – రూ.99.55, విజయవాడ – రూ.108.11 – రూ.99.70, విశాఖపట్నం – రూ. 107.11 – రూ.98.71, విజయనగరం – రూ.107.32 – రూ.98.91, పశ్చిమ గోదావరి – రూ.108.03 – రూ.99.60.
దేశంలోని ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. న్యూఢిల్లీ – 101.84 – 89.87 ముంబై – 107.83 – 97.45 కోల్‌కతా – 102.08 – 93.02 చెన్నై – 102.49 – 94.39 నోయిడా – 99.02 – 90.34 బెంగళూరు – 105.25 – 95.26 హైదరాబాద్ – 105.83 – 97.96 పాట్నా – 104.25 – 95.51 జైపూర్ – 108.71 – 99.02 లక్నో – 98.92 – 90.26 గురుగ్రామ్ – 99.46 – 90.47 చంఢీగర్ – 97.93 – 89.50
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎలా తెలుసుకోవాలి.. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సవరించడం జరుగుతుంది. సవరించిన కొత్త ధరలను ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు. అయితే, సవరించిన పెట్రోల్, డీజిల్ ధరలను ఇంట్లోనే కూర్చుని కేవలం ఒక్క ఎస్సెమ్మెస్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదంటే మీ సమీప పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి పెట్రోల్, డీజిల్ ధరను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ ధరల కోసం వినియోగదారులు.. తమ మొబైల్ నుండి ఆర్‌ఎస్‌పితో పాటు సిటీ కోడ్‌ను నమోదు చేసి 92249 92249 కు మెసేజ్ సెండ్ చేయవచ్చు. అలా ఇంధన ధరలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా, బిపిసిఎల్ ఇంధన ధరలు తెలుసుకోవాలంట.. మొబైల్‌లో ఆర్ఎస్‌పిని టైప్ చేసి 92231 12222 కు ఎస్ఎంఎస్ పంపవచ్చు. HPCL ధరల కోసం 92222 01122 కు HPPrice అని టైప్ చేసి SMS పంపవచ్చు.
Also read: