Viral Video: మొహం నిండా కళ్లు, పెదవులు, ముక్కులు.. కళ్లను సైతం మాయ చేస్తున్న వీడియో. ఇంతకీ ఇదేలా సాధ్యమైందంటే..
Viral Video: 80 ఏళ్ల ముసలివారిని కూడా 20 ఏళ్ల కుర్రాడిగా చూపించే శక్తి మేకప్‌కు ఉంది. కొన్ని సార్లు కళ్లను సైతం మేకప్ మోసం చేస్తుంటుంది. సినీ ఇండస్ట్రీలో మేకప్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా...
Viral Video: 80 ఏళ్ల ముసలివారిని కూడా 20 ఏళ్ల కుర్రాడిగా చూపించే శక్తి మేకప్‌కు ఉంది. కొన్ని సార్లు కళ్లను సైతం మేకప్ మోసం చేస్తుంటుంది. సినీ ఇండస్ట్రీలో మేకప్‌కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా మేకప్ స్టైల్‌లోనూ మార్పులు వస్తున్నాయి. మనిషి రూపాన్ని పూర్తిగా మార్చేసేలా మేకప్‌లో ఎన్నో టెక్నిక్‌లు వచ్చాయి. తాజాగా అలాంటి ఓ వెరైటీ మేకప్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాకు చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్ ప్రతిభకు ఈ వీడియో అద్దం పడుతోంది.
మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్‌మాన్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఈ యువతి వెరైటీ మేకప్‌తో ఆక్టటుకుంటోంది. మొహం నిండా కళ్లు, చెవులు, పెదాలను మేకప్ రూపంలో వేశారు. అసలు వాటిలో నిజమైన కళ్లు, ముక్కు ఏదో తేల్చడం సులభంగా లేనట్లుగా మేకప్ వేయడం విశేషం. వీడియోలో మొదట ఆ యువతి పెదాలకు లిప్‌స్టిక్ పెట్టుకుంటున్నట్లు కనిపించింది. కానీ కళ్లు తెరిచే సరికి అది పెదవి కాదు కన్ను అని తెలుస్తుంది. ఇలా కళ్లను మాయ చేస్తున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు మేకప్ ఆర్టిస్ట్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
వైరల్ వీడియో..
When the edibles hit… pic.twitter.com/BSeBnAAES9
— Rex Chapman?? (@RexChapman) July 15, 2021
Strawberry-Beauty Tips: మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా స్టాబెరీతో ఇలా చేసి చూడండి.. మెరిసే దంతాలు మీ సొంతం