CM YS Jagan: కీలక దశకు చేరుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఇవాళ పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం వైఎస్ జగన్

ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ కొనసాగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కీలక దశకు చేరింది. శరవేగంగా జరుగుతున్న ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.

CM YS Jagan: కీలక దశకు చేరుకున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. ఇవాళ పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం వైఎస్ జగన్
Cm Ys Jagan To Visit Polavaram Project
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 19, 2021 | 7:27 AM

CM YS Jagan Polavaram Tour: ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, 5 కోట్లమంది ప్రజల కలల ప్రాజెక్ట్. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వరప్రదాయని పోలవరం. ఎన్నో అవాంతరాలు, మరెన్నో సవాళ్లను అధిగమిస్తూ కొనసాగిన నిర్మాణం కీలక దశకు చేరింది. శరవేగంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని పరిశీలించేందుకు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్.. పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. రికార్డ్‌ వేగంతో పనులు జరగుతున్నాయి. ప్రాజెక్ట్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 11–12 గంటల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవల్సిన అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేయనున్నారు.

అయితే, గత ఏడాది డిసెంబర్‌లో పోలవరం పర్యటన చేపట్టిన జగన్‌..ఆ తరవాత కరోనా పెరగడంతో ప్రాజెక్ట్‌ పరిశీలనకు వెళ్లలేకపోయారు. ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా జరగడంతో మొత్తం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించాలని డిసైడైన సీఎం ఇవాళ పోలవరం పర్యటనకు రెడీ అయ్యారు. మరోవైపు, ప్రాజెక్టు పనులు దగ్గరపడుతుండటంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. స్థానికంగా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో గోదారి గలగలలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచడంతో దిగువకు ఉరకలెత్తుతోంది గోదారమ్మ. నదీమ తల్లి గలగలలు.. చల్లని గాలులు.. మనసును ఆహ్లాదపరుస్తున్నాయి.

Read Also…  Parliament: నేటి నుంచి పార్లమెంటు వర్షకాల సమావేశాలు.. అస్త్రశస్ర్తాలతో సిద్ధమైన అధికార, ప్రతిపక్షాలు.. చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే..!

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..