Selfie: ‘రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. లేకపోతే నో’.. అభిమానులకు షాకిచ్చిన బీజేపీ మహిళా మంత్రి
BJP Minister Usha Thakur: రాజకీయ ప్రముఖులు, నాయకులు ఎవరైనా కనిపిస్తే.. చాలామంది వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కామన్.. ఇలాంటి సందర్భాల్లో
BJP Minister Usha Thakur: రాజకీయ ప్రముఖులు, నాయకులు ఎవరైనా కనిపిస్తే.. చాలామంది వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగడం కామన్.. ఇలాంటి సందర్భాల్లో నాయకులు కొన్ని గంటల సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే.. తరచూ ఇలాంటి సమస్య ఎదురవుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలోని మహిళా మంత్రి కొంచెం వినూత్నంగా ఆలోచించి అభిమానులు, పార్టీ కార్యకర్తలకు షాకిచ్చారు. రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చంటూ ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఉషా ఠాకూర్ బహిరంగ ప్రకటన చేశారు.
ఈ మేరకు ఉషా ఖండ్వాలో మీడియాతో మాట్లాడారు. సెల్ఫీలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందంటూ ఆమె పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు గంటల కొద్ది ఆలస్యం అవుతుండటంతో.. పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చానని పేర్కొన్నారు. ఎవరైతే సెల్ఫీలు తీసుకుంటారో వారు స్థానిక పార్టీ యూనిట్ కోశాధికారికి రూ.100 జమ చేయాలంటూ పేర్కొన్నారు. ఇలా సమకూరిన నగదును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చని ఆమె వెల్లడించారు.
దీంతోపాటు తనను బహిరంగ కార్యక్రమాలకు పిలిచే వారు పుష్పగుచ్ఛాలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా ప్రజలకు సూచించారు. అలా అందిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చంటూ అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ బీజేపీ మంత్రి ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు పీఎం కేర్స్ నిధి కోసం రూ.500 విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Also Read: