Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‏పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…

చెన్నైలోని ప్రముఖ శాటిలైట్ ఛానెల్ సత్యం టీవీ ప్రధాన కార్యాలయంపై ఓ ఆగంతుడు దాడి చేశాడు. కత్తి.. కవచం ధరించిన గుర్తుతెలియని

Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‏పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు...
Satyam Tv
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 04, 2021 | 11:21 AM

చెన్నైలోని ప్రముఖ శాటిలైట్ ఛానెల్ సత్యం టీవీ ప్రధాన కార్యాలయంపై ఓ ఆగంతుడు దాడి చేశాడు. కత్తి.. కవచం ధరించిన గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం సాయంత్రం సత్యం టీవీపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ ఘటనలో కార్యాలయంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లగా.. సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న రాయపురం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ విజువల్స్ ఆధారంగా కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేపట్టారు. . డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆగంతకుడిని కోయంబత్తూరులోని ఉప్పిలిపాలేంకు చెందిన రాజేష్ కుమార్‏గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడి చేసిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Satyam

Satyam

సత్యం టీవీపై దాడి దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‏ను సదరు సంస్థ విడుదల చేసింది. అందులో మంగళవారం రాత్రి 6.45 గంటల సమయంలో ఆగంతుకుడు పెద్ద కత్తి, డాలు తీసుకుని సత్యం టీవీ కార్యలయం పై దాడి చేశాడు. అక్కడున్న సిబ్బందిని బెదిరించి ఆఫీస్ గ్లాస్, కంప్యూటర్స్, టేబుల్‏ను ద్వంసం చేశాడు. అంతేకాకుండా.. అక్కడున్న సిబ్బందిని అసత్య పదజాలంతో దూషించాడు.

Satyam 1

Satyam 1

ఈ ఘటనపై ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఐజాక్ లివింగ్ స్టోన్ మాట్లాడుతూ.. ఆగంతకుడు పార్కింగ్ స్థలం నుంచి కార్యాలయంలోకి ప్రవేశించాడని.. ఆయుధాలు ఉన్న బ్యాగ్ పట్టుకుని లోపలికి వచ్చినట్లుగా తెలిపారు. సత్యం టీవీ ఛానెల్ ఏ వ్యక్తికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయలేదని.. దాడి చేసిన వ్యక్తి ఎవరో కూడా తెలియదని.. ఇందుకు గల కారణాలు ఏంటనేది తమకు తెలివయని అన్నారు.

Also Read: Charmme Kaur: సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మి.. విరామం కావాలంటూ..

Karthika Deepam: మోనితకు దొరికిన అంజి..దీపకు షాక్..కార్తీక్ టెన్షన్..

Salaar Movie Update: షూటింగ్ స్టార్ట్ చేసిన ‘సలార్’.. యాక్షన్‏కు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్..

Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన ‘శాకుంతలం ‘ టీమ్..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..