Flipkart Big Saving Days Sale: మీకు ఫ్లిప్‌కార్ట్‌లో మెంబర్‌షిప్ ఉందా..? అయితే బంబర్ ఆఫర్..!
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరోసారి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జూలై 27, 29 తేదీల్లో ఈ సేల్స్‌తో..
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరోసారి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇప్పటికే జూలై 27, 29 తేదీల్లో ఈ సేల్స్‌తో కస్టమర్ల ముందుకు వచ్చిన ఫ్లిప్‌కార్ట్ ఎన్నో ఆఫర్లను తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్‌తో ముందుకు వస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రం ఒక రోజు ముందుగానే అంటే.. ఈ రోజు అర్థరాత్రి 12 గంటల నుంచే ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక మెంబర్ షిప్ లేనివారికి ఆగస్టు 5 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై గొప్ప తగ్గింపును ఇస్తోంది. అలాగే క్రెడిట్ కార్డులపై కూడా రాయితీలు ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీ, యాక్సిస్ కార్డుదారులకు సుమారు 10శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
గత నెలలో ఉన్న ఈ సేల్స్‌లో మొబైల్ ఫోన్‌లపై ఎన్నో ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా ఆఫర్లు ప్రకటించింది. ఈఎంఐ ఆప్షన్‌లో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. తాజాగా ప్రకటించే ఆఫర్లలో ఎలక్ట్రానిక్ పై 70 శాతం వరకు డిస్కౌంట్, మొబైల్ ఫోన్‌లపై 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్, ఎక్ఛేంజ్ ఆఫర్, టీవీలు, ఇతర ఉపకరణాలు కనీసం 60 శాతం వరకు డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లకు 35 నుంచి 50 శాతం వరకు బ్యాంకు కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్ అయిన శాంసంగ్ గెలక్సీ, ఆపిల్ ఐఫోన్, ఒప్పో, వివో ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లను ఇస్తోంది.