Work From Home: వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు ఇక కార్యాలయాలకు.. డిసెంబర్‌ నాటికి 50 శాతం మంది.!

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 04, 2021 | 7:59 AM

Work From Home: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఒక వైపు లాక్‌డౌన్‌, మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా..

Work From Home: వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు ఇక కార్యాలయాలకు.. డిసెంబర్‌ నాటికి 50 శాతం మంది.!

Work From Home: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఒక వైపు లాక్‌డౌన్‌, మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కారణంగా ప్రస్తుతం వైరస్‌ అదుపులో ఉంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా ఐటీ సంస్థలన్ని మూతపడ్డాయి. ఉద్యోగులందరూ వర్క్‌ఫ్రం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో ప్రస్తుతం 5 శాతం మంది కార్యాలయాలకు వస్తుండగా, డిసెంబరు నాటికి ఇది 50 శాతానికి చేరుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన ‘ఫ్యూచర్‌ వర్క్‌ మోడల్స్‌’ సర్వేలో తేలింది. అయితే 500 మంది ఉద్యోగులకన్నా తక్కువగా ఉన్న ఐటీ సంస్థల్లో ఇప్పటికే 20 శాతం మంది కార్యాలయాలకు వస్తూ పనులను కొనసాగిస్తున్నారని, 76 శాతం కంపెనీల్లో 9 శాతం మంది కార్యాలయాలకు వస్తుండగా, మధ్యస్థాయి, పెద్ద, అతి పెద్ద (ఎంఎల్‌వీఎల్‌) కంపెనీల ఉద్యోగుల్లో 5 శాతం మంది కార్యాలయాలకు వస్తున్నారని సర్వేలో తేలింది.

ఈ ఏడాది చివరి వరకు 33 శాతం..

కాగా, ఈ ఏడాది చివరి వరకు తమ ఉద్యోగులను కార్యాలయంకు రప్పించాలని 33 శాతం కంపెనీలు భావిస్తుండగా, 2022లో ఈ పని పూర్తి చేయాలని 41 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు మాత్రం, తమ ప్రధాన కార్యాలయాల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు 6 లక్షల మంది అయితే 2 లక్షల మందికి పైగా దూర ప్రాంతాల నుంచే పని చేస్తున్నారు. ఇక 70 శాతానికిపైగా కంపెనీలు హైబ్రిడ్‌ పని విధానానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంటే కరోనా టీకా రెండు డోసులు పూర్తయిన వారిని వారానికి 3 రోజులు ఆఫీసుకు రప్పించాలన్నది వీటి ప్రణాళికగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఉద్యోగులతో అయితేనే ఇది సాధ్యమవుతుంది. చిన్న సంస్థలు మాత్రం ‘టీకా వేయించుకుంటేనే అనుమతి’కి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ఇంటి నుంచి పని వల్ల ఉత్పాదక తగ్గింది:

కాగా, ఉద్యోగులు ఇంటి నుంచి పనులు కొనసాగించడం వల్ల ఉత్పాదక తగ్గిందని 22 శాతం సంస్థలు పేర్కొంటున్నాయి. క్లయింట్ల కోసం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని 27శాతం సంస్థలు భావిస్తున్నాయి. విద్యాసంస్థలు మొదలుకానందున, దంపతులిద్దరూ ఉద్యోగులుగా ఉంటే.. పిల్లలను ఎవరు చూసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అనుబంధ రంగాలను దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగులను కార్యాలయానికి రప్పించాలని భావిస్తున్నట్లు 39 శాతం సంస్థలు పేర్కొన్నాయి.

ఇవీ కూడా చదవండి

Reliance Jio Freedom Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. డైలీ డేటా లిమిట్‌ లేకుండా కొత్త ప్లాన్స్‌..!

Airtel: ఎయిర్‌టెల్‌కు పెరిగిన ఆదాయం.. జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభం..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu