Reliance Jio Freedom Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. డైలీ డేటా లిమిట్‌ లేకుండా కొత్త ప్లాన్స్‌..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 04, 2021 | 7:23 AM

Reliance Jio Freedom Plan:టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది..

Reliance Jio Freedom Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. డైలీ డేటా లిమిట్‌ లేకుండా కొత్త ప్లాన్స్‌..!

Follow us on

Reliance Jio Freedom Plan:టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ తీసుకువచ్చింది. అదే జియో ఫ్రీడమ్‌ ప్లాన్‌. ఈ ప్లాన్‌ కింద ప్రీపెయిడ్‌ ప్యాక్‌లను అందిస్తోంది. కొత్త ప్యాక్‌లు రోజువారీ పరిమితి లేకుండా వస్తాయి. అయితే చెల్లుబాటు, కాంప్లిమెంటరీ ప్రయోజనాల పరంగా ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు అందించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే జియో ఎన్నో రకాల ఆఫర్లను తీసుకురాగా, ఈ ప్లాన్‌ ద్వారా రోజువారీ లిమిట్‌ లేకుండా డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇతర ప్లాన్స్‌కు రోజువారీ డేటా లిమిట్‌ ఉండటం వల్ల డేటా అయిపోతే అందుకు డేటా కోసం మరో రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది అలా ఉండకుండా రోజువారీ లిమిట్‌ అంటూ ఉండదు.

రూ.127 ప్లాన్‌:

ఈ చౌకైన ప్రీడమ్‌ ప్లాన్‌ 15 రోజులు చెల్లుబాటుతో పాటు 12 జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజు వారీ పరిమితి అంటూ లేకుండా అందిస్తోంది. అదనంగా వినియోగదారులు జియో టీవీ సినిమా, జియో న్యూస్‌, జియో సెక్యూరిటీ సర్వీసులను ఉచితంగా పొందవచ్చు.

రూ.247 ప్లాన్‌:

ఈ ప్లాన్‌ 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. 25 జీబీ డేటా ఉంటుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజువారీ డేటా లిమిట్‌ లేదు. ఈ ప్లాన్‌ అన్ని కాంప్లిమెంటరీ బెనిఫిట్స్‌ పొందవచ్చు.

రూ.447 ప్లాన్‌:

ఈ ప్లాన్‌ కింద 50జీబీల డేటా లభిస్తుండగా, 60 చెల్లుబాటులో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు అన్ని కాంప్లిమెంటరీ బెనిఫిట్స్‌ లభిస్తాయి.

రూ.597:

ఈ ప్లాన్‌ 90 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. 75 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌ కింద అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు కూడా యాక్సెస్‌ పొందవచ్చు.

రూ.2,397 ప్లాన్‌:

ఈ ప్లాన్‌ తీసుకుంటే 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 365 జీబీల డేటా అందిస్తోంది. రోజువారీ డేటా లిమిట్‌ లేదు. పైన పేర్కొన్న ప్లాన్‌ల మాదిరిగా అన్ని బెనిఫిట్స్‌ పొందవచ్చు. గరిష్ట వ్యాలిడిటీ, డేటాతో ఇది అత్యంత ఖరీదైనది. అయితే రోజువారీ పరిమితి లేకుండా డేటాను ఉపయోగించే వారికి ఈ ఫ్రీడమ్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడతుందని రిలయన్స్‌ జియో చెబుతోంది. ఈ ప్లాన్స్‌ను ఎంచుకున్న కస్టమర్లకు ఎలాంటి డైలీ డేటా లిమిట్ ఉండదు. ప్లాన్ అందించే మొత్తం డేటా అయిపోయే అంతవరకు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ప్లాన్ గడువు ముగిసే వారకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

Jio Plan

ఇవీ కూడా చదవండి

Airtel: ఎయిర్‌టెల్‌కు పెరిగిన ఆదాయం.. జూన్‌ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభం..!

Home Loan: మీరు హోమ్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు ఇవే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu