Home Loan: మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? వివిధ బ్యాంకుల తాజా వడ్డీ రేట్లు ఇవే..!
Home Loan: వివిధ రకాల బ్యాంకులు రుణాలపై అనేక ఆఫర్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే మరి కొన్ని బ్యాంకులు తక్కువగా అందిస్తున్నాయి..
Home Loan: వివిధ రకాల బ్యాంకులు రుణాలపై అనేక ఆఫర్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే మరి కొన్ని బ్యాంకులు తక్కువగా అందిస్తున్నాయి. అయితే సుదీర్ఘకాలం పాటు కొనసాగే రుణాలలో గృహరుణం కూడా ఒకటనే చెప్పాలి. వ్యక్తిగతంగా గానీ ఉమ్మడిగా గానీ హోమ్ లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది. గృహరుణం మొత్తం విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఇది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో కొనుగోలుదారుడు స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే రుణం విలువ ఎక్కువ కాబట్టి కాలపరిమితి కూడా ఎక్కువగానే ఉంటుంది. 15 నుంచి 30 ఏళ్ల పాటు చెల్లింపులకు సమయం ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు కొనసాగిస్తే నెలవారీగా చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతున్నప్పటికీ, వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎంత రుణం తీసుకుంటారో అంత మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు మొత్తం, వడ్డీ రేటుతో పాటు కాలపరిమితి, ప్రాసెసింగ్ ఫీజు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. 25 సంవత్సరాల కాలపరిమితితో 30 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే వివిధ బ్యాంకులు వర్తించే వడ్డీ రేట్లు తెలుసుకుందాం.
► ఐసీఐసీఐ బ్యాంకు 6.75 శాతం నుంచి 7.55 శాతం వరకు, ► యాక్సిస్ బ్యాంకు 6.90 శాతం నుంచి 8.40 శాతం. ► ఇండియన్ బ్యాంకు 6.85 శాతం నుంచి 8.00 శాతం. ► కోటాక్ మహీంద్రా 6.65 శాతం నుంచి 7.30 శాతం. ► బ్యాంకు ఆఫ్ బరోడా 6.75 నుంచి 8.60 శాతం. ► స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75 శాతం నుంచి 8.50 శాతం. ► హెచ్‌డీఎఫ్‌సీ 6.75 శాతం నుంచి 7.65 శాతం. ► పంజాబ్ నేషనల్ బ్యాంకు 6.80 శాతం నుంచి 9.00 శాతం. ► యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 6.80 శాతం నుంచి 7.40 శాతం. ► సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం నుంచి 7.30 శాతం. ► బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం నుంచి 8.85 శాతం.