Salaar Movie Update: షూటింగ్ స్టార్ట్ చేసిన ‘సలార్’.. యాక్షన్‏కు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Aug 04, 2021 | 7:15 AM

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. అటు థియేటర్లు

Salaar Movie Update: షూటింగ్ స్టార్ట్ చేసిన 'సలార్'.. యాక్షన్‏కు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్..
Salaar

Follow us on

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. అటు థియేటర్లు కూడా ఓపెన్ కావడం.. చిత్రాలు కూడా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంటుండతంతో.. వీలైనంతవరకు తమ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‏టైనర్ సలార్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‏లుక్ పోస్టర్‏కు విశేష స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్ అంటూ ప్రభాస్ డిఫరెంట్ లుక్‏లో చూపించాడు ప్రశాంత్ నీల్.

ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్‏లో తిరిగి ప్రారంభించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న అర్థరాత్రి ఒంటిగంట వరకు పాల్గొన్నట్లు హీరోయిన్ శ్రుతిహసన్ తన ఇన్‏స్టాలో వెల్లడించింది. ఇక ఈ షెడ్యూల్‏లో ఆగస్ట్ 8 నుంచి ప్రభాస్ పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇంతకుముందు ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‏ను రామగుండం పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. ఆ తర్వాత ముంబైలోనూ కొన్ని సీన్స్ తీశారు. ఈ మూవీతోపాటు.. ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్ సరసన.. పూజా హెగ్డే నటిస్తుండగా.. రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ – గీతాకృష్ణ ప్రొడక్షన్స్ – టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ట్వీట్..

Also Read:

Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన ‘శాకుంతలం ‘ టీమ్..

Naveen Polishetty: ‘ఒక్క ట్వీట్‌ జీవితాన్ని మార్చేసింది’.. నిరుద్యోగికి అండగా నిలిచిన నవీన్ పోలిశెట్టి..

Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్‌పై గృహహింస కేసు.. నోటిసులు జారీ చేసిన కోర్టు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu