Ram Pothineni: రామ్ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధర… అతడే కారణమా ?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో పోతినేని రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రామ్..

Ram Pothineni: రామ్ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధర... అతడే కారణమా ?
Ram Pothineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 04, 2021 | 7:46 AM

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో పోతినేని రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రామ్.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. అయితే చాలా కాలంగా ప్లాపులతో సతమతమవుతున్న రామ్‏కు ఇటీవల పూరీ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్స్ పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

#RAPO19 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‏గా నటిస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‏గా పేరు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ పోతినేని.. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆడియో హక్కులు అత్యధిక ధరకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ దాదాపు రూ. 2.75 కోట్లు వెచ్చించి మరీ ఈ సినిమా ఆడియో రైట్స్ అందుకున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అటు తెలుగు, తమిళంలోని ఆడియో హక్కులకు ఇంత మొత్తం చెల్లించినట్లుగా టాక్ నడుస్తోంది.అయితే రామ్ కెరీర్‏లోనే ఇంతలా మ్యూజిక్ రైట్స్‏ను దాదాపు రూ. 2.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి అంటున్నారు. అయితే ఈ మూవీ ఆడియో రైట్స్‏కు ఇంత డిమాండ్ రావడం కారణం.. దేవి శ్రీ ప్రసాద్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తమిళ్, తెలుగులో దేవి మ్యూజిక్‏కు ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఆడియో హక్కుల కోసం ఇంతలా వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా… విడుదలకు ముందే రామ్ పోతినేని సినిమా సంచలనం సృష్టిస్తోంది.

Also Read: Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన ‘శాకుంతలం ‘ టీమ్..

Naveen Polishetty: ‘ఒక్క ట్వీట్‌ జీవితాన్ని మార్చేసింది’.. నిరుద్యోగికి అండగా నిలిచిన నవీన్ పోలిశెట్టి..