AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Charmme Kaur: సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మి.. విరామం కావాలంటూ..

తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‏గా అడుగుపెట్టిన ఛార్మి... తక్కువ కాలంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Charmme Kaur: సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మి.. విరామం కావాలంటూ..
Charmme
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2021 | 8:16 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‏గా అడుగుపెట్టిన ఛార్మి… తక్కువ కాలంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలను అందుకుంటున్న ఛార్మి.. ఆ తర్వాత నిర్మాతగా మారి డైనమిక్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి చిత్రాలను నిర్మించే పనిలో పడింది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉంటున్నా…ఛార్మి.. ఇటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఛార్మి షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. గత కొంతకాలంగా సైలెంట్‏గా ఉన్న ఛార్మి.. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత ఫుల్ జోష్ మీద ఉన్నారు. సినిమాలను సంబంధించిన ప్రతి చిన్న చిన్న అప్‏డేట్స్‏తోపాటు.. తన వ్యక్తిగత వివరాలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్‏లో ఉంటారు ఛార్మి.

ప్రస్తుతం ఛార్మి లైగర్ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుండగా… బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఛార్మి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆమె అభిమానులను షాక్‏కు గురిచేసింది. తాను విరామం కోసం సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చింది.. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో.. మంచి కోసం సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నాను సి యూ గాయ్స్… అంటూ ట్వీట్ చేసింది. ఛార్మికి ట్విట్టర్ ఖాతాలో 600కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలోని కీలక సన్నివేశాలు ఈ నెలలో చిత్రీకరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడానికి ఛార్మి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Ram Pothineni: రామ్ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధర… అతడే కారణమా ?

Salaar Movie Update: షూటింగ్ స్టార్ట్ చేసిన ‘సలార్’.. యాక్షన్‏కు సిద్ధమైన యంగ్ రెబల్ స్టార్..

Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన ‘శాకుంతలం ‘ టీమ్..