Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన ‘శాకుంతలం ‘ టీమ్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Aug 04, 2021 | 7:15 AM

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక ప్రేమగాధ శాకుంతలం. ఇందులో మలయాళ

Allu Arha: సెట్‏లోకి అడుగుపెట్టిన అల్లు అర్హ.. గ్రాండ్‏గా వెల్‏కమ్ చెప్పిన 'శాకుంతలం ' టీమ్..
Allu Arha

Follow us on

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక ప్రేమగాధ శాకుంతలం. ఇందులో మలయాళ స్టార్ రీహో దేవ్ మోహన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. దిల్‏రాజు సమర్పణలో.. డీఆర్పీ..గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాతోనే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ వెండి తెర అరంగేట్రం చేస్తోంది. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ.. ప్రిన్స్ భరత పాత్రలో కనిపించబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Arha

Arha

అయితే తాజాగా హైదరాబాద్‏లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‏లో అల్లు అర్హ జాయిన్ అయ్యింది. ఈ సందర్భంగా అల్లు అర్హకు ఘనంగా స్వాగతం పలికింది శాకుంతలం టీమ్. అలాగే అల్లు అర్హకు మేకప్ వేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో రివీల్ చేశారు చిత్రయూనిట్. స్టార్ అల్లు అర్హ కోసం సిద్ధంగా ఉంది అంటూ కార్వాన్‏కు సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది నిర్మాత నీలిమ గుణశేఖర్. అల్లు అర్హకు స్వాగతం పలకడానికి కార్వాన్‏ను ARHA లెటర్ బెలూన్‏లతో అందంగా ముస్తాబు చేసి స్వాగతం పలికారు. ఇప్పటికే అల్లు అర్హకు నెట్టింట్లో అభిమానులు ఎక్కువే ఉన్నారు. తన క్యూట్ మాటలతో.. అల్లరితో ఎంతో పాలోయింగ్ ఏర్పర్చుకున్న అర్హ.. ఏకంగా పాన్ ఇండియా సినిమా శాకుంతలం ద్వారా సినీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ట్వీట్..

Also Read:

Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్‌పై గృహహింస కేసు.. నోటిసులు జారీ చేసిన కోర్టు..

Nayattu Remake: మలయాళ సినిమాపై కన్నేసిన గీతా ఆర్ట్స్‌.. పొలిటికల్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేసే పనిలో పడ్డ అల్లు అరవింద్‌.

SR Kalyana Mandapam: థియేటర్లలో సందడికి సిద్ధమైన కళ్యాణ మండపం.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.

Pushpa Movie: ఫ్యాన్స్ సిద్దంకండి.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu