Nayattu Remake: మలయాళ సినిమాపై కన్నేసిన గీతా ఆర్ట్స్‌.. పొలిటికల్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేసే పనిలో పడ్డ అల్లు అరవింద్‌.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Aug 03, 2021 | 7:19 PM

Nayattu Remake: మలయాళంలో ఈ ఏడాది విడుదలైన 'నయట్టు' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద...

Nayattu Remake: మలయాళ సినిమాపై కన్నేసిన గీతా ఆర్ట్స్‌.. పొలిటికల్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేసే పనిలో పడ్డ అల్లు అరవింద్‌.
Nayattu Remake In Telugu

Follow us on

Nayattu Remake: మలయాళంలో ఈ ఏడాది విడుదలైన ‘నయట్టు’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మార్టిన్‌ ప్రక్కట్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రీమేక్‌ చేసే పనిలో పడింది గీతా ఆర్ట్స్‌. ఈ మేరకు అల్లు అరవింద్‌ ఇప్పటికే ఈ మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు మార్టిన్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ రీమేక్‌ చేయడానికి మేకర్స్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక తెలుగు రీమేక్‌కు అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా హిందీకి మాత్రం జాన్‌ అబ్రహం నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ‘నయట్టు’ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీ వేదికగా కూడా మంచి రెస్పాండ్స్‌ అందుకుంది. మరి ఈ సినిమా రీమేక్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: స్వర్గంలో ‘రంభ’ ఈ అందాల ముద్దుగుమ్మ..! భలే అవకాశం కొట్టేసిన గ్లామర్ బ్యూటీ..

Pushpa Movie: ఫ్యాన్స్ సిద్దంకండి.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్

Premi Vishwanath: న్యూలుక్‏తో అభిమానులను కట్టిపడేస్తున్న వంటలక్క.. రెడ్ డ్రెస్‏లో ఏంజెల్‏గా ప్రేమి విశ్వనాథ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu