స్వర్గంలో ‘రంభ’ ఈ అందాల ముద్దుగుమ్మ..! భలే అవకాశం కొట్టేసిన గ్లామర్ బ్యూటీ..

Monal Ghajjar : టాలీవుడ్ టాప్‌ హీరో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు

స్వర్గంలో 'రంభ' ఈ అందాల ముద్దుగుమ్మ..! భలే అవకాశం కొట్టేసిన గ్లామర్ బ్యూటీ..
Monal Ghajjar

Monal Ghajjar : టాలీవుడ్ టాప్‌ హీరో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ.

అయితే ఈ సినిమాలో నటి మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్వర్గంలో ఉండే రంభ పాత్రలో నటిస్తోంది. నాగార్జునతో కలిసి ఒక పాటలో నర్తించనుంది. బంగార్రాజు సినిమాలో స్వర్గంలో సుదీర్ఘమైన ఎపిసోడ్ ఉంది. ఫాంటసీ ఎపిసోడ్‌లో కొన్ని కామెడీ భాగాలు ఒక పాట ఉంటుంది. మోనాల్ గజ్జర్ భాగం ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. ‘యమగోల’ ‘యమలీల’ తరహాలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సరదా ఎపిసోడ్‌ని రూపొందిస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమా ప్రారంభమవుతుంది.

కింగ్ నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. ఇటీవల ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఈ వయసులో కూడా కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు నాగ్

 

View this post on Instagram

 

A post shared by M Monal Gajjar (@monal_gajjar)

 

John Abraham : ఈ హీరో యాక్టింగ్‌తో పాటు బిజినెస్‌లో కూడా బెస్ట్..! కోట్ల రూపాయలకు అధిపతి..?

Sonu Sood : సోనుసూద్‌‌పై ఇది వేరే లెవల్ అభిమానం..! 50 వేల చదరపు విస్తీర్ణంలో భారీ చిత్రం

AHA OTT: ఆహా నుంచి మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌.. ఆకట్టుకుంటోన్న తరగతి గది దాటి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌..

Click on your DTH Provider to Add TV9 Telugu