AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Abraham : ఈ హీరో యాక్టింగ్‌తో పాటు బిజినెస్‌లో కూడా బెస్ట్..! కోట్ల రూపాయలకు అధిపతి..?

John Abraham : బాలీవుడ్ విలక్షణ నటుడు జాన్ అబ్రహం తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. మొదటి నుంచి బాలీవుడ్

John Abraham : ఈ హీరో యాక్టింగ్‌తో పాటు బిజినెస్‌లో కూడా బెస్ట్..!  కోట్ల రూపాయలకు అధిపతి..?
John Abraham
uppula Raju
|

Updated on: Aug 02, 2021 | 4:16 PM

Share

John Abraham : బాలీవుడ్ విలక్షణ నటుడు జాన్ అబ్రహం తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. మొదటి నుంచి బాలీవుడ్ ప్రముఖులకు దూరంగా ఉంటూ బిజినెస్ కొనసాగిస్తున్నాడు. యాక్షన్ సినిమా అయినా, కామెడీ సినిమా అయినా, థ్రిల్లర్ సినిమా అయినా నటన పరంగా జాన్ ఎవరికీ తక్కువ కాదు. ప్రతి సినిమాలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటాడు. ప్రతి పాత్రలోను తనను తాను మలుచుకుంటాడు. అందుకే ఇతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సినిమాలతో పాటు, ఫుడ్ జాయింట్ల నుంచి వోడ్కా బ్రాండ్ల వరకు అనేక పెద్ద పెద్ద వ్యాపారాలను కలిగి ఉన్నాడు. ఈ రోజు నటుడి మొత్తం నికర విలువ ఎంత తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు.

జాన్ అబ్రహం నికర విలువ $ 34 మిలియన్లకు దగ్గరగా ఉంది. ఇది భారతీయ రూపాయిలలో దాదాపు 251 కోట్లు. జాన్ ప్రస్తుతం ముంబైలోని తన పెంట్ హౌస్‌లో నివసిస్తున్నాడు. బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం ద్వారా జాన్ సినిమాల కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. విరాళాలు ఇవ్వడంలో కూడా జాన్ ముందు వరుసలో ఉంటాడు. అతని ఆదాయంలో ఎక్కువ భాగం వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు, ప్రచారాలకు విరాళంగా వెళుతుంది. ఇది కాకుండా బాలీవుడ్‌లో అత్యధిక పన్ను చెల్లించే నటులలో జాన్ కూడా ఒకరు.

జాన్ ప్రతి నెలా 1 కోటి 20 లక్షలు సంపాదిస్తాడు. జాన్ ఇతర వ్యాపారం గురించి మాట్లాడుతూ.. నటుడికి న్యూఢిల్లీలో ‘ఫ్యాట్ అబ్రహం బర్గర్’ అనే తన సొంత రెస్టారెంట్ ఉంది. అతను తన సొంత ఫుట్‌బాల్ జట్టును కలిగి ఉన్నాడు. వీరి పేరు ముంబై ఏంజిల్స్. జాన్ వోడ్కా బ్రాండ్‌ను కూడా కలిగి ఉన్నాడు. అతని వోడ్కా బ్రాండ్ పేరు ‘ప్యూర్ వండర్ అబ్రహం’. ఇది కాకుండా అతని వద్ద “జాన్ అబ్రహం సీడ్స్” అనే పెర్ఫ్యూమ్ బ్రాండ్ ఉంది.

2003 సంవత్సరంలో జాన్ తన జిస్మ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నటుడి పేరు హీరోయిన్ బిపాసా బసుతో ముడిపడి ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ ఒకరినొకరు విడిపోయారు. జాన్ తన చిరకాల స్నేహితురాలు ప్రియా రుంచల్‌ను 2014 లో వివాహం చేసుకున్నాడు. జాన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విలాసవంతమైన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. జాన్ ఇల్లు 5,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. జాన్ తన మొత్తం కుటుంబంతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు.

Salt in Diet: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ప్రమాదం.. మరి తక్కువైతే ఫర్వాలేదా? ఉప్పు తక్కువ తీసుకుంటే ఏం జరుగుతుంది.. తెలుసుకోండి!

Tokyo Olympics 2020 Live: కాసేపట్లో మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్స్.. అథ్లెట్లో పతకం తెచ్చి.. భారతీయుల కల నెరవేర్చేనా

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..