Sonu Sood: వింటర్‌ సీజన్ స్పెషల్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా రియల్ హీరో

Sonu Sood: సాటి మనిషి కష్టం లో ఉంటే మనం మంచి మనసుతో స్పందించి.. మనకు తోచిన సాయం చేస్తే.. దేవుడు హర్షిస్తాడు. సమాజం గుర్తించి మనల్ని ప్రేమిస్తుంది. ప్రపంచం అటువంటి..

Sonu Sood: వింటర్‌ సీజన్ స్పెషల్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా రియల్ హీరో
Sonu Sood
Follow us
Surya Kala

|

Updated on: Aug 02, 2021 | 3:56 PM

Sonu Sood: సాటి మనిషి కష్టం లో ఉంటే మనం మంచి మనసుతో స్పందించి.. మనకు తోచిన సాయం చేస్తే.. దేవుడు హర్షిస్తాడు. సమాజం గుర్తించి మనల్ని ప్రేమిస్తుంది. ప్రపంచం అటువంటి మానవతా వాదులను హక్కును చేర్చుకుంటుంది.. ఈ విషయానికి నిలువెత్తు నిదర్శనం నటుడు సోనూ సూద్. కరోనా కష్ట కాలంలో ప్రజల కష్టాలను చూసి స్పందించిన సోను సూద్ మంచి మనసుకు ఒక్క భారత దేశ ప్రజలే కాదు.. ప్రపంచమే ఫిదా అయ్యింది.

ఏంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రియల్ హీరో సోను సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. నెక్స్ట్ ఇయర్ రష్యా వేదికగా జరిగే వింటర్ సీజన్ స్పెషల్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. ఈ విషయాన్నీ సోనూ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని హర్షం వ్యక్తం చేశారు సోనూ . అంతేకాదు స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌ బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందని చెప్పిన సోనూ సూద్ ఎస్‌వో భారత్‌ జట్టుకు​ ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

2021 జనవరి 22 నుంచి రష్యాలోని కజాన్ వేదికగా స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ పోటీలకు హాజరయ్యే భారతీయ అథ్లెట్స్ బృందానికి రియల్ హీరో నాయకత్వం వహించనున్నారు. సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం పై ప్రత్యేక ఒలింపిక్స్ భారత్ ఛైర్‌పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో చేరడానికి అంగీకరించిన సోనూ సూద్ కు కృతజ్ఞత చెప్పారు. సోనూ కరోనా మొదటి వేవ్ లో మొదలు పెట్టిన సామజిక కార్యక్రమాలు నేటికీ విభిన్న రూపాల్లో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే..

Also Read: ప్రకృతి ప్రసాదం కుంకుడుకాయలు.. రసాయనాల సమ్మేళనం షాంపూ.. జుట్టుకి ఏది మంచిదో తెలుసా