Tokyo Olympics 2020: ఆమె కులమేంటి? భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుపై సోషల్ మీడియాలో ‘చెత్త’ చర్చ

పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా రికార్డులను నెలకొల్పింది.

Tokyo Olympics 2020: ఆమె కులమేంటి? భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధుపై సోషల్ మీడియాలో ‘చెత్త’ చర్చ
Pv Sindhu
Follow us
Venkata Chari

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 02, 2021 | 5:38 PM

PV Sindhu: పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా రికార్డులను నెలకొల్పింది. అలాగే రెండవ భారత అథ్లెట్‌గాను చరిత్రలోకి ఎక్కింది. అయితే నెజిటన్లు మాత్రం ఆమె ఒలింపిక్ పతకం కంటే ఎక్కువగా గూగుల్‌లో దేని గురించి వెతికారో తెలిస్తే మాత్రం షాకవుతారు. పీవీ సింధు కులం ఏంటంటూ ఆరా తీయడం మొదలెట్టారు. ఎక్కువ మంది ఈ విషయంపై పెద్ద చర్చనే మొదలు పెట్టారు. ఆదివారం సింధు 21-13, 21-15 తేడాతో చైనాకు చెందిన హీ బింగ్జియావోను ఓడించింది. ఒలింపిక్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ గేమ్స్‌లో పతకాలు సాధించిన నాల్గవ మహిళా షట్లర్‌గా పేరుగాంచింది. మ్యాచ్‌లో ఆమె దూకుడితో 53 నిమిషాల్లోనే మ్యాచును ముగించింది. అయితే స్వర్ణం గెలవడంలో మాత్రం తడబడింది. పీవీ సింధు క్యాస్ట్, పీవీ సింధు తండ్రి కులం ఏంటి, పీవీ సింధు బయోగ్రఫీతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కీవార్డ్‌లతో ఎక్కువగా సెర్చ్ చేయడం విశేషం. ఇందులో ఒకరు కమ్మ అని, మరొకరు వైశ్య అని, ఇంకొకరు కోమటి అంటూ చర్చలు కొనసాగించారు.

Pv Sindhu (1)

ఈ మ్యాచ్ అనంతరం ఎక్కువమంది గూగుల్‌లో సింధు కులంపై ఆరా తీయడం మొదలెట్టారు. ఇది గూగుల్‌లోనూ ట్రెండింగ్‌గా మారడం విశేషం. అయితే ఆమె విజయాన్ని ఆనందించకుండా ఇలా కులాన్ని వెతడకమేంటంటూ కొంతమంది విమర్శలు కూడా గుప్పించారు. అయితే సెలబ్రెటీల విషయంలో ఇలా జరడగం మాములేమి కాదు. ఐఏఏఎఫ్ ప్రపంచ యూ20 ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్‌ హిమదాస్ విషయంలోనూ ఇలానే కులం గురించి వెతికారు.

Also Read: ఒక్క పరుగుకే ఐదు వికెట్లు.. ప్రత్యర్ధులను బెంబేలెత్తించిన దిగ్గజ బౌలర్.. ఆ ప్లేయర్ ఎవరంటే.?

Viral Photo: బ్యాటింగ్ ప్యాడ్లను ఇలా కూడా వాడతారా..! వైరలవుతోన్న టీమిండియా స్పీడ్‌స్టర్ ఫొటో