నిజానికి ఆసియాలోని అత్యుత్తమ మహిళల ఫీల్డ్ హాకీ జట్లలో భారత మహిళల హాకీ జట్టు ఒకటి. అంతర్జాతీయ వేదికగా అనేక పతకాలను దక్కించుకుంది. 1982 లో ఆసియా గేమ్స్ లో , 2002 కామన్వెల్త్ గేమ్స్ లోనూ గోల్డ్ మెడల్ ను , 2004, 2017లో రెండుసార్లు ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. 2016లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. అంతర్జాతీయ ర్యాంకింగ్ లో భారత విమెన్ హాకీ టీమ్ తమ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈరోజు టోక్యో ఒలింపిక్స్ లో పతకం ముద్దాడడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.