Naveen Polishetty: ‘ఒక్క ట్వీట్‌ జీవితాన్ని మార్చేసింది’.. నిరుద్యోగికి అండగా నిలిచిన నవీన్ పోలిశెట్టి..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Aug 04, 2021 | 6:32 AM

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఎంతోమంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సినీ సెలబ్రిటీలు చాలామంది కష్టాల్లో ఉన్నవారికి...

Naveen Polishetty: 'ఒక్క ట్వీట్‌ జీవితాన్ని మార్చేసింది'.. నిరుద్యోగికి అండగా నిలిచిన నవీన్ పోలిశెట్టి..
Naveen Polishetty

Follow us on

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఎంతోమంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సినీ సెలబ్రిటీలు చాలామంది కష్టాల్లో ఉన్నవారికి తోడు ఉంటూ తోచిన సాయాన్ని చేశారు. ఇదిలా ఉంటే ‘జాతి రత్నాలు’ ఫేం హీరో నవీన్ పోలిశెట్టి ఈ కరోనా కష్టకాలంలో అభిమానులకు అండగా నిలిచాడు. తనకు తోచిన సాయాన్ని అందిస్తూ ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే వ్యక్తికి ఒక్క ట్వీట్‌తో జాబ్ ఇప్పించాడు.

చరణ్, సౌమ్య అనే ఇద్దరు నెటిజన్లు.. సమీర్ అనే వ్యక్తి కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్నాడని.. ఎవరైనా హెల్ప్ చేయాలంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం నవీన్ పోలిశెట్టి దృష్టికి వచ్చింది. వెంటనే సదరు వ్యక్తి వివరాలను పేర్కొంటూ హైదరాబాద్ ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చెప్పాలంటూ కోరాడు. అంతే నవీన్ చేసిన ట్వీట్‌కు ఈవోక్-వేగాన్ స్టోర్ & కేఫ్ సమీర్‌కు ‘స్టోర్ కమ్ కేఫ్ మేనేజర్‌గా ఉద్యోగాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించిన అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను నవీన్ పోస్ట్ చేసి తన దృష్టికి తీసుకొచ్చిన చరణ్, సౌమ్యలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయినవారిని ఆదుకుందామంటూ ట్వీట్ చేశాడు.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu