Viral News: భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

Strange Habit: ఎంతోమంది ఎన్నో వింత అలవాట్లు ఉంటాయి. అవి వారికి బాగానే ఉన్నప్పటికీ.. మిగిలినవారిని మాత్రం ఇబ్బంది... పెడుతుంటాయి….

Viral News: భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
Bathroom
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 02, 2021 | 8:48 PM

ఎంతోమంది ఎన్నో వింత అలవాట్లు ఉంటాయి. అవి వారికి బాగానే ఉన్నప్పటికీ.. మిగిలినవారిని మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమందికి ఫోన్‌ను అతిగా వాడటం అలవాటు.. మరికొందరు టాయిలెట్‌కు పదేపదే వెళ్తుంటారు. ఇంకొందరు పదేపదే చేతులను శుభ్రపరుస్తూ ఉంటారు. ఇలాంటి వివిధ వింత అలవాట్ల వల్ల పక్కవాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి వింత అలవాటు కారణంగా అతడి భార్య కలత చెందుతోంది.

తన భర్త రోజుకు నాలుగు గంటల పాటు టాయిలెట్‌లో గడుపుతాడని ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌లో పేర్కొంది. తాను ఎక్కడికైనా బయటికి వెళ్లాలని అనుకున్నప్పుడు, భోజనానికి పిలిచినప్పుడు, ఇంటికి అతిధులు విచ్చేసినప్పుడు తన భర్త టాయిలెట్‌లోకి దూరుతాడని ఆమె వాపోయింది.

”మేము కొద్దిరోజుల క్రితమే కొత్త ఇంటికి వచ్చాం. అప్పటి నుంచి నా భర్త జస్టిన్ టాయిలెట్‌లో ఎక్కువ సమయం ఉండటం ప్రారంభించాడు. ఈ వింత అలవాటు కారణంగా మా మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. తినడానికి పిలిచినా, లేదా బయటికి వెళ్లాలని చెప్పినా, అతిధులు ఇంటికి వచ్చినా జస్టిన్ టాయిలెట్‌లోకి వెళ్లేవాడు” అని ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ ద్వారా పేర్కొంటూ.. ఈ సమస్యకు పరిష్కారం వెతకడం ప్రారంభించింది.

తన భర్త వింత అలవాటు గురించి ప్రస్తావిస్తూ ఓ ఉదాహరణను కూడా ఆమె చెప్పుకొచ్చింది. ”ఒక రోజు భార్యాభర్తలు ఇద్దరూ కూడా డిన్నర్‌కు రెస్టారెంట్ వెళ్లగా.. ఇప్పుడే వస్తానంటూ జస్టిన్ టాయిలెట్‌లోకి వెళ్లాడు. 5 నిమిషాలు.. 10 నిమిషాలు.. 15 నిమిషాలు.. జస్టిన్ ఇంకా రాలేదు. ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. అతడి మొబైల్‌కు కాల్ చేస్తే ఆన్సర్ లేదు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు. అతడి కోసం చూసి.. చూసి.. అతని భార్య ఒంటరిగా భోజనం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. జస్టిన్ వింత అలవాటును చూసి అతడి చుట్టాలు కూడా ఆశ్చర్యపోయారు.

ఆమె పోస్టుకు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు అతడు ఫోన్‌కు బానిస అయినట్లు ఉన్నాడని కామెంట్ చేయగా.. మరికొందరు వీడియో గేమ్స్ అడుతున్నాడేమోనని.. ఇంకొందరు పోర్న్ వీడియోలు చూడొచ్చు అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికీ ఆ మహిళకు తన భర్త వింత అలవాటుకు గల కారణం దొరకలేదు.

Read Also: గుడ్ న్యూస్ః డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి..

ఒక్క పరుగుకే ఐదు వికెట్లు.. ప్రత్యర్ధులను బెంబేలెత్తించిన దిగ్గజ బౌలర్.. ఆ ప్లేయర్ ఎవరంటే.?

నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!

మొబైల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవంటూ..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!