Viral Pic: ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Aug 03, 2021 | 2:09 PM

తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుంటారు. అదే విధంగా సెలబ్రిటీలు కొన్నిసార్లు ఫ్యాన్స్‌ కోసం...

Viral Pic: ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!
Kajal

Follow us on

తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోలపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుంటారు. అదే విధంగా సెలబ్రిటీలు కొన్నిసార్లు ఫ్యాన్స్‌ కోసం తమ త్రోబ్యాక్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. అవి కాస్తా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. లక్షల్లో లైకులు, షేర్లు వచ్చి పడుతుంటాయి. ఇదే కోవలో తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన చైల్డ్‌హుడ్ పిక్ ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ముసి ముసిగా నవ్వుతూ.. అందమైన డ్రెస్‌లో చందమామలా కెమెరాకు ఫోజిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్‌లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు మాత్రమే కాదు.. యువ హీరోలతో సైతం జత కట్టింది. తమిళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ‘చందమామ’గా అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆమెవరో ఈపాటికే మీకు అర్ధమై ఉంటుంది. అవును, మీరునుకుంటున్నది కరెక్టే ఆమె మన కాజల్ అగర్వాల్. ఇలా చూడచక్కటి డ్రెస్‌లో కెమెరాకు ఫోజిచ్చింది.

కాగా, కాజల్ ప్రస్తుతం ‘హే సినామికా’, ‘కరునగాపియం’, ‘ఘోస్టీ’, ‘ఆచార్య’, ‘ఉమా’, ‘ఇండియన్ 2’, ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రాల్లో నటిస్తోంది. వీటిల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu