Money Heist: “విజయమో.. వీరమరణమో”.. ప్రొఫెసర్‌కు ఇది అంతమా.? దుమ్ములేపుతున్న ‘మనీ హెయిస్ట్’ ట్రైలర్!

''అన్ని వెబ్ సిరీస్‌లలోనూ 'మనీ హెయిస్ట్' వేరయా.. విశ్వదాభిరామ.. వినురవేమ''.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు.. వెబ్ సిరీస్ ప్రేక్షకులకు...

Money Heist: విజయమో.. వీరమరణమో.. ప్రొఫెసర్‌కు ఇది అంతమా.? దుమ్ములేపుతున్న 'మనీ హెయిస్ట్' ట్రైలర్!
Money Heist
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 04, 2021 | 6:11 AM

”అన్ని వెబ్ సిరీస్‌లలోనూ ‘మనీ హెయిస్ట్’ వేరయా.. విశ్వదాభిరామ.. వినురవేమ”.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు.. వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ది హాట్ ఫేవరెట్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. ఈ సిరీస్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ వెబ్ సిరీస్‌లో ఉన్న ప్రతీ క్యారెక్టర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ప్రొఫెసర్‌కు ఇండియాలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదిరిపోయే కాన్సెప్ట్, ఫెంటాస్టిక్ మేకింగ్‌ వెరసి ఈ సిరీస్‌ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. పేరుకు ఇది స్పానిష్ వెబ్ సిరీస్ అయినా.. ఇంగ్లీష్‌లోకి డబ్ అయి నెట్‌ఫ్లిక్స్‌లోకి రిలీజ్ అయిన తర్వాత వరల్డ్‌వైడ్‌గా మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఇక దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో దీనికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మనీ హెయిస్ట్ సీజన్ 5 ట్రైలర్ వచ్చేసింది. తెలుగులో కూడా నెట్ ఫ్లిక్స్ ఇండియా రిలీజ్ చేసింది. మొదటి నాలుగు సీజన్లు ఒక ఎత్తయితే.. ఈ లాస్ట్ సీజన్ మరో ఎత్తు అనిపించేలా ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్పోయిలర్స్ బట్టి చూస్తే.. ప్రొఫెసర్ అంతం.? టోక్యో గతం.? బెర్లిన్ రాక.? హ్యూమన్ బాంబుగా మారిన గండియా.? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి.

రెండు భాగాలుగా సీజన్ 5ను రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం ట్రైలర్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సెప్టెంబర్ 3న ఫస్ట్ పార్ట్, డిసెంబర్ 3న రెండో పార్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ సీజన్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ పక్కా అన్నట్లు తెలుస్తోంది. అటు యూట్యూబ్‌లో మొదటి పార్ట్ ట్రైలర్ దూసుకుపోతోంది.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!