Ippudu Kaka Inkeppudu: విడుదలకు ముందే చిత్రయూనిట్‌కు షాక్.. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..
ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రయూనిట్‌కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. విడుదలకు ముందే ఈ సినిమాపై కేసు నమోదు చేశారు.
ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రయూనిట్‌కు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు. విడుదలకు ముందే ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్లో హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉందని పేర్కొంటూ ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు 67 ఐటీ యాక్ట్, 295 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నూతన దర్శకుడు యుంగధర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ట్రైలర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇందులోని పాటలు, సీన్లు, డైలాగులు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో వ్యక్తిరేకత వచ్చింది. అందులోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని పలువురు చిత్రయూనిట్‌ను హెచ్చరించారు. హీరోహీరోయిన్లకు సంబంధించిన సన్నివేశంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌గా ఓ భక్తి గీతాన్ని వినిపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రైలర్ వీక్షించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మూవీ టీంపై సుమటోగా కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలిపారు. అయితే సినిమా పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై డైరెక్టర్ స్పందించాడు. సినిమా విషయంలో మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు.
Also Read: Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‌పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…