Andhra Pradesh: ప్రమోషన్ అంటూ పార్టీ ఇస్తాడు.. ఆపై అందినకాడికి దోచుకెళ్తాడు.. వీడి మోసాలు అన్నీఇన్ని కావు..
Andhra Pradesh: ఇల్లు అద్దెకు కావాలంటూ వస్తాడు.. ఇంట్లో అద్దెకు దిగి అన్నీ గమనిస్తాడు.. వీలైనంత త్వరగా ఇంటి యజమానులతో..
Andhra Pradesh: ఇల్లు అద్దెకు కావాలంటూ వస్తాడు.. ఇంట్లో అద్దెకు దిగి అన్నీ గమనిస్తాడు.. వీలైనంత త్వరగా ఇంటి యజమానులతో పరిచయం చేసుకుంటాడు. ఆ పై తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తాడు. అందినకాడికి దోచుకెళ్తాడు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక చోరీలకు పాల్పడిన ఘరానా దొంగ యుగంధర్‌ను తాజాగా నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘరానా దొంగ యుగంధర్ ముందుగా ఇల్లు అద్దెకు కావాలంటూ వస్తాడు. ఆపై ఇంట్లో అద్దెకు దిగి మంచిగా నటిస్తాడు. కొద్ది రోజులు అన్నీ సర్దుకున్నాక ప్రమోషన్ వచ్చిందంటూ ఇంటి యజమానులకు మత్తుమందు ఇచ్చి.. వారు అపస్మారస్థితిలోకి వెళ్లగానే ఇళ్లంతా గుల్ల చేస్తాడు. ఇదే మాదిరి దోపిడీకి నూజివీడులోనూ పాల్పడ్డాడు యుగంధర్. అయితే, ఈ సారి అడ్డంగా దొరికిపోయాడు.
తాజాగా ఒ ఇంట్లో అద్దెకు దిగిన యుగంధర్.. వారితో సన్నిహితంగా మెలగడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే తనకు ప్రమోషన్ వచ్చిందని నమ్మబలికి ఇంటి యజమానులకు మత్తుమందు కలిపిన స్వీట్లు, కూల్ డ్రింక్ ఇచ్చాడు. అవి తిన్న ఇంటి యజమానులు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆ వెంటనే యుగంధర్ తన చేతులకు పని చెప్పాడు. ఇంట్లోని బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకుని ఉడాయించాడు. బాధిత వ్యక్తులు సాధారణ స్థితికి వచ్చాక.. జరిగిన దోపిడీని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు యుగంధర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 8 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, 2006 నుంచి యుగంధర్ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. తెనాలి, ఖమ్మం, నెలకొండపల్లి, విజయవాడ, రావులపాలెం, గన్నవరం, తిరువూరు ప్రాంతాల్లో యుగంధర్ దోపిడీలకు పాల్పడ్డాడని, 15 కేసులలో నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు యుగంధర్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Also read:
Sathiyam Tv: సత్యం టీవీ ఛానెల్‌పై దాడి చేసిన ఆగంతకుడు.. పోలీసుల అదుపులో నిందితుడు…
CM KCR: మరికాసేపట్లో దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్.. వాసాలమర్రి దళితవాడ గ్రామస్తులతో భేటీ!