CM KCR: మరికాసేపట్లో దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్.. వాసాలమర్రి దళితవాడ గ్రామస్తులతో భేటీ!
దత్తత గ్రామమైన వాసాలమర్రి కష్టాలను తీర్చేందుకు మరోసారి.. గ్రామంలో పర్యటించబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో బుధవారం పర్యటించనున్నారు.
CM KCR to visit Vasalamarri: దత్తత గ్రామమైన వాసాలమర్రి కష్టాలను తీర్చేందుకు మరోసారి.. గ్రామంలో పర్యటించబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో బుధవారం పర్యటించనున్నారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గంలో వాసాలమర్రికి చేరుకుంటారు.
కాగా, గత జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి.. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. ఇవాళ మరోసారి గ్రామాభివృద్ధిపై చర్చించేందుకు విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ముందుగా దళితవాడలో పర్యటించి, ఆ తర్వాత గ్రామంలోని వీధులన్నీ పరిశీలిస్తారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై 130మంది గ్రామస్థులతో సీఎం సమావేశం అవుతారు.
గత పర్యటనలో తాను చేసిన పలు సూచనలు.. అమలు తీరుపై ఈ సందర్భంగా సీఎం సమీక్షించనున్నట్టు తెలుస్తోంది. మున్ముందు చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి మంగళవారం వాసాలమర్రిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో వాసాలమర్రికి వెళ్లినప్పుడు.. 20సార్లు అయినా వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలో జూలై 9న గ్రామ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైనా.. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. Read Also…