ఒక్కసారిగా మారిన గ్రామస్తుల తలరాతలు.. స్థలాల ధరలకు రెక్కలు.. డేగల్లా వాలుతున్న రియల్టర్లు..!
అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు.
Ramappa Temple Real boom: అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. ఇంతకు అదెక్కడో తెలుసా..
కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. వరంగల్, హైదరాబాద్ నుంచి బడాబడా రియల్టర్లు ఇక్కడ వాలిపోయారు.
ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువే. ఎకరం పొలం సుమారు 20 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర 40 లక్షల నుంచి 45 లక్షల రూపాయలకు చేరుకుంది.
యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా చాలామంది ఉన్నారు. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నారు. భవిష్యత్తులో రామప్ప టూరిస్ట్ ప్లేస్‌గా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో ధర ఎంతైనా సరే కొందాం అనే ఆలోచనలో ఉన్నారు రియల్టర్లు.
Read Also… Ramappa: కాకతీయుల కళాత్మకతకు అద్భుతమైన శిల్పరీతి.. ఇసుక పునాదిపై వెలిసిన రామప్ప దేవాలయం