Cyberabad Traffic Police: బీ అలర్ట్.. ఒక్క ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉన్నా ఇక అంతే సంగతులు..
Cyberabad Traffic Police: భాగ్యనగరం పరిధిలోని వాహనదారులకు ముఖ్య గమనిక. ఇకపై ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో
Cyberabad Traffic Police: భాగ్యనగరం పరిధిలోని వాహనదారులకు ముఖ్య గమనిక. ఇకపై ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉన్నా మీరు మీ వాహనాన్ని వదులుకోవాల్సిందే. పెండింగ్ చలాన్లు కడితే గానీ.. మీ వాహనాన్ని వదిలిపెట్టబోమంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. తనిఖీల సమయంలో పట్టుబడిన వాహనాలకు ఒక్క చలానా పెండింగ్‌లో ఉన్నట్లు కనిపించినా.. ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇంతకాలం ఉదాసీనతగా వ్యవహరిస్తూ వచ్చిన పోలీసులు.. ఇకపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో చిక్కిన వాహనాలకు ఒక్క ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉన్నా వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
గతంలో మూడు చలానాలు పెండింగ్‌లో ఉంటే వాహనాన్ని అదుపులోకి తీసుకుంటామన్నారు. వాటిని క్లియర్ చేస్తే గానీ వాహనాన్ని రిలీజ్ చేయబోమంటున్నారు. కాగా, చలాన్ల విషయంలో గతేడాది సైబరాబాద్ పరిధిలో 47.83 లక్షల కేసుల్ని నమోదు చేసి.. రూ. 178.35 కోట్ల జరిమానా విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే.. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ జరిమానాలు కట్టిస్తున్నారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరి.. వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త. వెంటనే మీ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోండి. లేదంటే.. బండిని వదులుకోవాల్సి వస్తుంది.
Also read:
ఒక్కసారిగా మారిన గ్రామస్తుల తలరాతలు.. స్థలాల ధరలకు రెక్కలు.. డేగల్లా వాలుతున్న రియల్టర్లు..!
Flipkart Big Saving Days Sale: మీకు ఫ్లిప్‌కార్ట్‌లో మెంబర్‌షిప్ ఉందా..? అయితే బంబర్ ఆఫర్..!
Jhansi Railway Station: ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు!.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..