SI Arrest: మహిళా ట్రైనీ ఎస్ఐపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఎస్‌ఐ అరెస్ట్ .. అట్రాసిటి కేసు.. సబ్ జైలుకు తరలింపు
మహబూబాబాద్ జిల్లాలో మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన మరిపెడఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై మంగళవారం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
Maripeda SI Srinivas Reddy Arrested: మహబూబాబాద్ జిల్లాలో మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన మరిపెడఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై మంగళవారం లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి..ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారే ఇలా చేయడంపై డిపార్ట్ మెంట్ సీరియస్ గా తీసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై అట్రాసిటి కేసు నమోదు చేశారు. అంతేకాదు అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి 14 రోజుల మహబూబాబాద్ సబ్ జైలు రిమాండ్‌కు తరలించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు చేస్తే ఎంతటివారైనా సరే శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తెలిపారు.
మహిళా ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం ఘటన తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో తీవ్ర కలకలం రేగింది. తోటి ఎస్ఐనే బలాత్కారం చేయడం సంచలనం కలిగించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకుఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటేసిన ఉన్నతాధికారులు. అత్యాచారయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీకి బాధ్యతలు అప్పగించారు. ఈ తెల్లవారుజామున శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. అనంతరం, జైలుకు తరలించారు.