అమెరికాలోని పెంటగాన్ మెట్రో స్టేషన్ వద్ద కత్తిపోట్లు..కాల్పుల కలకలం..పోలీసు అధికారి మృతి..దుండగుని కాల్చివేత
అమెరికాలోని పెంటగాన్ లో మెట్రో బస్ స్టేషన్ వద్ద జరిగిన కత్తిపోట్లు, కాల్పుల ఘటనలో ఓ పోలీసు అధికారి మరణించగా..పోలీసుల కాల్పుల్లో ఆ దుండగుడు మృతి చెందాడు. ఈ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లో ఉన్న ఈ అధికారిపై దుండగుడు కత్తితో దాడి చేసి పలుమార్లు
అమెరికాలోని పెంటగాన్ లో మెట్రో బస్ స్టేషన్ వద్ద జరిగిన కత్తిపోట్లు, కాల్పుల ఘటనలో ఓ పోలీసు అధికారి మరణించగా..పోలీసుల కాల్పుల్లో ఆ దుండగుడు మృతి చెందాడు. ఈ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లో ఉన్న ఈ అధికారిపై దుండగుడు కత్తితో దాడి చేసి పలుమార్లు పొడిచాడని, గొంతుపై గాయాలతో ఆయన మరణించాడని పోలీసులు చెప్పారు. పారిపోతున్న దుండగుడిపై జరిపిన కాల్పుల్లో అతడు మృతి చెందాడు. అయితే అనేకసార్లు ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తోంది. బహుశా పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ దుండగుడు కూడా కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. పెంటగాన్ లో విధించిన లాక్ డౌన్ ని నిన్న ఎత్తివేశారు. ఏమైనా.. ఈ ఘటనల్లో కొందరు గాయపడ్డారని పోలీసులు అంటున్నారు. కొన్ని గంటలపాటు జరిగిన ఫైరింగ్ తో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందారు. పోలీసు అధికారి మృతిపై ఎఫ్ బీ ఐ దర్యాప్తు ప్రారంభించింది. పెంటగాన్ మెట్రో బస్ స్టేషన్ నిత్యం రద్దీగా, ప్రయాణికుల హడావుడితో ఉంటుంది. ఈ కారణంగా ఈ ఘటన జరిగినప్పుడు కొందరు గాయపడి ఉంటారని భావిస్తున్నారు.
2010 లో కూడా ఇదే ప్రాంతంలో ఈ విధమైన సంఘటన జరిగింది. తాజా ఘటన నేపథ్యంలో మెట్రో బస్ స్టేషన్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమెరికాలో గన్ కల్చర్, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తుపాకుల సంస్కృతికి చెక్ పెట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికీ పడితే వారికీ గన్ లైసెన్సులు ఇవ్వడం కూడా ఇందుకు కారణమవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఛాయ్ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.
పాపం వధువును కష్టపెట్టిన వరుడు..! రోడ్డుపైనే వరమాల సందడి.. చివరకి ఎం అయ్యింది..:Bride Viral Video