Joe Biden: వ్యాక్సిన్ల తయారీలో ఇండియాకు మాదే ఆపన్న హస్తం..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
వ్యాక్సిన్ల తయారీలో ఇండియాకు,ఇతర దేశాలకు తమ దేశమే సాయం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. తమకు తామే సొంతంగా కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసుకునేందుకు ఈ దేశాలకు మేం సహాయం చేస్తున్నాం అని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ల తయారీలో ఇండియాకు,ఇతర దేశాలకు తమ దేశమే సాయం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. తమకు తామే సొంతంగా కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేసుకునేందుకు ఈ దేశాలకు మేం సహాయం చేస్తున్నాం అని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ అదుపునకు ఎన్నో కోట్ల డాలర్లను వ్యయం చేయవలసి ఉంటుందని, ఈ మొత్తంలో సగం కోట్ల డాలర్లనైనా అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఇండియా వంటి దేశాలకు మరింత సాయం చేస్తామని అన్నారు. పైగా తామిందుకు ఏ దేశం నుంచి కూడా ఛార్జిని వసూలు చేయడంలేదని.. సాధ్యమైనంత ఎక్కువగా తోడ్పడేందుకే కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్ పై జరుపుతున్న పోరులో అమెరికా’వ్యాక్సిన్ ఆయుధం’ గా మారేందుకు కట్టుబడి ఉందని, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రజాస్వామ్యాన్ని ఆయుధంగా ఎలా వినియోగించారో అలాగే తామిప్పుడు ఈ మహమ్మారి మీద దీన్ని ఆయుధంగా వాడుతున్నామని ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలు జరుపుతున్న పోరాటం కన్నా మేమే ఎక్కువగా పోరాడుతున్నాం…ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో గల మా భాగస్వామ్యం ద్వారా వ్యాక్సిన్ల తయారీలో పూర్తిగా సహకరిస్తున్నాం అని బైడెన్ వ్యాఖ్యానించారు. గత జూన్ లో తాను యూరప్ వెళ్ళినప్పుడు 500 మిలియన్ డోసుల ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలు చేసి స్వల్పాదాయం గల 100 దేశాలకు సరఫరా చేస్తామని చెప్పామని ఆయన వెల్లడించారు. ఈ టీకామందు ఈ పేద దేశాలకు ఈ నెలాఖరులో అందుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేబట్టిన కోవాక్స్ కార్యక్రమాన్ని గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch : పోయి పనిచూసుకోమన్న కేంద్రం..!మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..( వీడియో )
ఛాయ్ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.